వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుఎస్ ఎంబసీపై ఆత్మాహుతి దాడి: ఇద్దరు మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Bomb Blast outside US embassy in Turkey
అంకారా: టర్కీ రాజధాని అంకారాలోని అమెరికా రాయబార కార్యాలయంపై శుక్రవారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు మరణించారు. అమెరికా రాయబార కార్యాలయం ప్రవేశద్వారం వద్ద ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చేసుకున్నట్లు చెబుతున్నారు. మృతులు ఇద్దరు కూడా సెక్యూరిటీ గార్డులని సమాచారం.

రాయబార కార్యాలయం పక్క ద్వారం వద్ద ఓ శవం పడి ఉండడాన్ని ఓ జర్నలిస్టు చూశాడు. రాయబార కార్యాలయం వీసా సెక్షన్ ద్వారం సెక్యురిటీ చెక్‌పాయింట్ లోపల ఆత్మాహుతి దాడి జరిగినట్లు తెలుస్తోంది. వెంటనే పలు అంబులెన్స్‌లు రంగంలోకి దిగాయి. గాయపడినవారిని అంబులెన్స్‌లోకి ఎక్కించి తరలించారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

రాయబార కార్యాలయం ఫోన్లు పని చేయడం లేదని అంటున్నారు. నిజానికి, అమెరికా రాయబార కార్యాలయానికి భారీ భద్రత ఉంటుంది. ఈ ప్రాంతంలోనే ఇతర దేశాల రాయబార కార్యాలయాలు కూడా ఉన్నాయి. జర్మనీ, ఫ్రాన్స్ రాయబార కార్యాలయాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. దాడి జరిగిన ప్రాంతాన్ని పోలీసులు దిగ్బంధం చేసి, జర్నలిస్టులను అక్కడి నుంచి పంపించి వేశారు.

ఈ దాడికి ఎవరు పాల్పడ్డారనేది తెలియడం లేదు. అయితే, కుర్ద్ తిరుగుబాటుదారులు, ఇస్లామిక్ మిలిటెంట్లు టర్కీలో చురుగ్గా ఉన్నారు. కుర్దులు అధికంగా నివసించే ప్రాంతానికి కుర్దు తిరుగుబాటుదారులు స్వయంప్రతిపత్తిని కోరుతున్నారు. వీరు గత ఏడాది కాలంగా దాడులకు దిగుతున్నారు.

English summary
A suspected suicide bomber detonated an explosive device at the entrance of the US Embassy in the Turkish capital on Friday and at least two people are dead, a police official said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X