మంత్రి ఇంటి ముట్టడి: పుల్లా పద్మావతి వాహనంపై దాడి

Baswaraj Saraiah - Pulla Padmavathi
వరంగల్/హైదరాబాద్: తెలంగాణ కోసం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బిసి సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య ఇంటిని అఖిల భారత విద్యార్థి పరిషత్(ఎబివిపి) తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సమితి(టిఆర్ఎస్‌వి)లు సోమవారం ముట్టడించాయి. కేంద్రం తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయనందున మంత్రి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు.

దీంతో పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్త ఉద్రిక్తతకు దారి తీసింది. విద్యార్థులు పోలీసు జీపు అద్దాలను ధ్వంసం చేశారు. పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జ్ చేసి విద్యార్థులను అక్కడి నుండి చెదరగొట్టారు. శాసనమండలి సభ్యురాలు పుల్లా పద్మావతిని కూడా విద్యార్థులు అడ్డుకున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం పదవులకు రాజీనామాలు చేయాలంటూ వారు పోచమ్మ మైదాన్ సెంటర్ వద్ద పుల్లా పద్మావతి ప్రయాణిస్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. కారు అద్దాలు ధ్వంసం చేశారు.

వెంకటేష్ వ్యాఖ్యలు సరికావు

సహకార ఎన్నికలు రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా జరిగాయని తెరాస నేత వినోద్ కుమార్ అన్నారు. సహకార ఎన్నికల్లో కాంగ్రెసు గెలిస్తే సమైక్యంగానే ఉంటుందన్న టిజి వెంకటేష్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తెలంగాణలోని పది జిల్లాలకు గాను ఏడు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు. తెలంగాణలో సమైక్యాంధ్ర పేరుతో పోటీ చేసి గెలవగలరా అని ప్రశ్నించారు.

స్వామి గౌడ్‌కు బిజెపి మద్దతు

ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెరాస నేత స్వామి గౌడ్‌కు భారతీయ జనతా పార్టీ మద్దతు ప్రకటించింది. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు బిజెపి వెనక్కి తగ్గింది. గుంటూరు, కృష్ణా జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి జూపూడి రంగరాజు, అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి లక్ష్మారెడ్డికి బిజెపి మద్దతు ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+