వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మజ్లిస్ ఎమ్మెల్యేని కలిసేందుకు అక్బర్ నో!: మరో కేసు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Akabaruddin Owaisi - Quadri Pasha
హైదరాబాద్/అదిలాబాద్: సొంత పార్టీకి చెందిన శాసనసభ్యుడిని కలిసేందుకు మజ్లిస్ పార్టీ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ సోమవారం నిరాకరించారట. హిందువులు, దేశం పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టైన అక్బర్ అదిలాబాదు జిల్లా సబ్ జైలులో ఉన్నారు. సోమవారం ఆయనను కలిసేందుకు పార్టీకి చెందిన చార్మినార్ ఎమ్మెల్యే ఖాద్రీ పాషా వచ్చారు. అయితే ఆయనను కలిసేందుకు అక్బర్ నిరాకరించినట్లుగా జైలు అధికారులు చెప్పారు.

అయితే, ఖాద్రీ పాషా మాత్రం అక్బర్ నడవలేని స్థితిలో ఉన్నందున తాను కలవలేకపోయానని చెప్పారు. ఖాద్రీ అక్బరును చూసేందుకు హైదరాబాదు నుండి అదిలాబాదు జిల్లా జైలు వద్దకు చేరుకున్నారు. అక్బరుతో ఆయన కలువలేకపోయారు. అనంతరం ఆయన మాట్లాడారు. అక్బరు, మజ్లిస్ పార్టీ పైన రాజకీయ కుట్ర జరుగుతోందన్నారు. తమ పార్టీని బలహీనపర్చే కుట్రను ప్రభుత్వం చేస్తోందన్నారు. అయితే, తాము ప్రజల మద్దతుతో మరిన్ని ఎక్కువ సీట్లు కైవసం చేసుకుంటామని చెప్పారు.

కోర్టులో హాజరు - స్వర పరీక్ష

అక్బరుద్దీన్‌ను ఈ రోజు నిర్మల్ కోర్టులో హాజరుపర్చనున్నారు. సిడిలో ఉన్న గొంతు తనది కాదని అక్బర్ చెప్పడంతో మెజిస్ట్రేట్ ఎదుట స్వరపరీక్షలు జరుపుతారు.

మంగళ్‌హాట్‌లో అక్బర్ పైన మరో కేసు

హైదరాబాదులోని మంగళ్ హాట్‌లో అక్బరుద్దీన్ పైన మరో కేసు నమోదయింది. స్థానిక భారతీయ జనతా పార్టీ కార్పోరేటర్ రాజాసింగ్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదయింద. మంగళ్ హాట్ పోలీసులు సోమవారం అక్బరు పైన కేసు నమోదు చేశారు. రాజాసింగ్ పిటిషన్ పైన స్పందించిన 16వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు పోలీసులు ఈ కేసును నమోదు చేశారు.

295ఏ, 298 సెక్షన్ కింద ఈ కేసును నమోదు చేసినట్లుగా పోలీసులు చెప్పారు. కాగా తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా అక్బరుద్దీన్ మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల పలుమార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నా రాలేదు. దీంతో ఆయన మరోసారి బెయిల్ పటిషన్ దాఖలు చేశారు.

English summary
The MIM MLA representaing the Charminar constituency in Hyderabad Mr Ahmed Pasha Quadri, has accused the government of harassing MIM leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X