ఆత్మహత్యలువద్దు: బొత్స, జోగి వ్యాఖ్యలపై నో కామెంట్

Botsa Satyanarayana
హైదరాబాద్: తెలంగాణ కోసం యువత ఆత్మహత్యలు చేసుకోవద్దని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం అన్నారు. కేంద్రం తెలంగాణపై శాశ్వత పరిష్కారం కోసం ఆలోచిస్తోందన్నారు. సాధ్యమైనం త్వరలో కేంద్రం తెలంగాణపై ఓ నిర్ణయం ప్రకటిస్తుందన్నారు. కాంగ్రెసు పార్టీకి ప్రజలు, రైతుల మద్దతు ఉందని సహకార ఎన్నికల ద్వారా రుజువయిందని అన్నారు.

ప్రజలు కాంగ్రెసుతోనే ఉన్నారన్నారు. రైతులకు సంక్షేమ పథకాలు కాంగ్రెసు వల్లనే సాధ్యమన్నారు. రైతులు, ప్రజల పట్ల కాంగ్రెసు పార్టీ చిత్తశుద్దికి సహకార ఎన్నికలే నిదర్శనం అన్నారు. ఎన్నికల్లో గెలిపించినందుకు రైతులకు బొత్స కృతజ్ఞతలు తెలిపారు. ఎక్కువ స్థానాల్లో కాంగ్రెసు పార్టీయే గెలిచిందన్నారు. ప్రతిపక్షాల మోసపూరిత, మాయ మాటలను రైతులు నమ్మలేదని ఆయన అన్నారు.

సంక్షేమం, అభివృద్ధికి కాంగ్రెసు పార్టీ కట్టుబడి ఉందన్నారు. ఆ రెండింటితోనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాలన కొనసాగుతోందన్నారు. ఎన్నో ఇబ్బందులను అధిగమించి సహకార ఎన్నికల్లో గెలిపొందామన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాగే గెలుస్తామని చెప్పారు. డిసిసిబి చైర్మన్‌లు ప్రభుత్వానికి, ప్రజలకు సంధానకర్తలుగా ఉండాలని బొత్స సత్యనారాయణ సూచించారు. భవిష్యత్తులో తాము మరిన్ని పథకాలు చేపడతామన్నారు.

జోగి వ్యాఖ్యలపై నో కామెంట్

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని గద్దె దించే కుట్ర చేస్తున్నారన్న జోగి రమేష్ వ్యాఖ్యలపై మాట్లాడేందుకు బొత్స నిరాకరించారు. కాంగ్రెసు పార్టీని, పార్టీ నాయకత్వాన్ని విమర్శించిన వారు ఎవరైనా కాంగ్రెసు పార్టీ బహిష్కృతులేనని ఆయన చెప్పారు. నాయకత్వం, పార్టీ విధానాల పట్ల కాంగ్రెసు నేతలు విధేయులుగా ఉండాలన్నారు. లేదంటే వారు బహిష్కృతులే అన్నారు.

అవినీతిపరుడిని కాదు

తాను ఎలాంటి, అవినీతి అక్రమాలకు పాల్పడలేదని బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖపట్నంలో తనకు 15 ఎకరాల భూమి కాదు కదా 15 సెంట్లు కూడా లేదన్నారు. తనకు అక్కడ భూమి ఉందని ఎవరైనా నిరూపిస్తే అది వారికే రాసిస్తానని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+