జగన్ పార్టీకి ఇక్కడేం పని?: కవిత, షర్మిల ఆపరేషన్‌పై..

పార్లమెంటులో బిల్లు పెడితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఏం చేస్తుందని ప్రశ్నించారు. అనంతపురం జిల్లాకు చెందిన ఆ పార్టీ నేత గుర్నాథ్ రెడ్డి చెప్పిన మాటలు ఆ పార్టీ అభిప్రాయంగా గుర్తించాలా? అని అడిగారు. లేదంటే వెంటనే తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. ఒకవేళ ఆ పార్టీ సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నట్లయితే తెలంగాణలో ఏం పని? అని కల్వకుంట్ల కవిత ఘాటుగా ప్రశ్నించారు.
షర్మిలకు ఆపరేషన్ జరగలేదు!
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలకు ఆపరేషన్ జరగలేదని కవిత అనుమానాలు వ్యక్తం చేశారు. ఆపరేషన్ నిజమే అయితే అందుకు సంబంధించిన వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణపై స్పష్టత ఇచ్చిన తర్వాతనే షర్మిల తెలంగాణలో పాదయాత్ర చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. లేదంటే తాము నల్ల జెండాలతో ఆమె మరో ప్రజా ప్రస్థానం యాత్రకు నిరసన తెలియజేస్తామన్నారు.
జగన్ అధికారంలోకి వస్తే వైయస్ కుటుంబానికే వెలుగు కానీ, తెలంగాణకు కాదన్నారు. తెలంగాణలోని నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను షర్మిల గౌరవించాలని ఆమె సూచించారు. షర్మిల తెలంగాణకు మద్దతు తెలిపాలని ఆమె డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు జగన్ పార్టీ తెలంగాణపై స్పష్టత ఇవ్వక పోవడం శోచనీయం అన్నారు. బ్రదర్ అనిల్ కుమార్, షర్మిల అవినీతి విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని భావిస్తున్నానని చెప్పారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాల్సి వస్తుందనే షర్మిల పాదయాత్రను ఆపేశారన్నారు.












Click it and Unblock the Notifications