హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బలుపు కాదు: కిరణ్‌కు కెటిఆర్, కెసిఆర్ కేసులపై డిజిపి

By Srinivas
|
Google Oneindia TeluguNews

KT Rama Rao-DGP Dinesh Reddy
హైదరాబాద్/కరీంనగర్: సహకార ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ ఘన విజయం సాధించిందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో చెప్పుకుంటున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం కరీంనగర్ జిల్లాలో అన్నారు. అధికార పార్టీ అక్రమాలకు పాల్పడి సహకార సంఘ ఎన్నికల్లో గెలుపొందిందని మండిపడ్డారు. కిరణ్ వాపు చూసి బలుపు అనుకుంటే వారికే నష్టమన్నారు.

సహకార ఎన్నికల్లో విజయం సాధించి చంకలు గుద్దుకుంటున్న కిరణ్‌కు శాసనసమండలి ఎన్నికలను రెఫరెండంగా తీసుకునే సత్తా ఉందా అని సవాల్ విసిరారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన స్వామి గౌడ్‌కు తెలంగాణవాదులు అందరూ మద్దతు పలకాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సహకార ఎన్నికలు అధికార దర్ఫానికి నిదర్శనం

రాష్ట్రంలో జరిగిన సహకార ఎన్నికలు కాంగ్రెసు పార్టీ అధికార, ధనబల దర్పానికి నిదర్శనం అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు అన్నారు. సహకార సంఘాల ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై విచారణకు విచారణ సంఘాన్ని నియమించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపు సరికాదని, దానిపై ఈ నెల 28న కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.

కెసిఆర్ కేసులు పోలీసులు చూసుకుంటారు

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన రాష్ట్రంలో నమోదైన కేసుల విషయాన్ని స్థానిక పోలీసులే చూసుకుంటారని డిజిపి దినేష్ రెడ్డి వేరుగా హైదరాబాదులో అన్నారు. మాజీ మంత్రి, కంటోన్మెంటు శాసనసభ్యుడు శంకర రావు పైన పోలీసుల వేధింపులు అవాస్తవమన్నారు. ఆయన ఐసియులో ఉన్నందున మాట్లాడలేక పోయామన్నారు. శంకర రావు వివాదంపై సిఐడి విచారణ జరుగుతోందని, నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

English summary
Telangana Rastra Samithi MLA Kalvakuntla Taraka Rama Rao lashed out at CM Kiran Kumar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X