తెలంగాణపై కేంద్రంలో మారుతున్నసీన్: గవర్నర్‌కు ఫోన్

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణకు అనుకూలంగా ఉన్నప్పటికీ లాభ నష్టాలు బేరీజు వేసుకొని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందనే పలువురు సీనియర్ నేతల సూచనల మేరకు దీనిపై తర్జన భర్జన పడుతున్నారు. సోమవారం ఢిల్లీ వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పలువురు కోర్ కమిటీ సభ్యులు, కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతోనూ భేటీ అయ్యారు.
అందరి భేటీలోనూ తెలంగాణ అంశం చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ అంశంపై ఇప్పట్లో నిర్ణయం తీసుకోవద్దని, ఏ నిర్ణయం చెప్పినా కష్టమేనని ముఖ్యమంత్రి కాంగ్రెసు పెద్దలతో చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే తెలంగాణపై ఏదో ఒకటి తేల్చాలనే పట్టుదలతో కాంగ్రెసు పార్టీ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. సాధ్యమైనంత త్వరగా తేల్చాలని భావిస్తోంది. అందుకే దీనిపై సీరియస్‌గా చర్చిస్తోంది.
ఇప్పటికే ముఖ్యమంత్రి అభిప్రాయాన్ని తీసుకున్న అధిష్టానం ఇక ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణను పిలిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో రెండు రోజుల్లో బొత్స ఢిల్లీ పయనం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు గవర్నర్ నరసింహన్ కూడా ఈ నెల 8వ తేదిన ఢిల్లీ వెళ్లే అవకాశముంది. ఆయనకు సోమవారం రాత్రి సోనియా, షిండే, అంటోనీలు ఫోన్ చేసి తెలంగాణ అంశంపై చర్చించినట్లుగా తెలుస్తోంది. సాయంత్రం కిరణ్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో భేటీ కానున్నారు.












Click it and Unblock the Notifications