గొంతుమార్చిన అక్బర్! అనారోగ్యమని.: బెయిలొచ్చినా

అయితే అక్బరుద్దీన్ గొంతు మార్చి మాట్లాడలేదని, అనారోగ్యం కారణంగా ఆయన గొంతు అలా వస్తుందని చెబుతున్నారు. సిడిలలోని స్వరాన్ని పోల్చుకునేందుకు అక్బరుద్దీన్ ఓవైసికి మరోసారి స్వర పరీక్షలు నిర్వహించే అవకాశముంది. ఆయన ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఈ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. మరోవైపు అక్బరుద్దీన్ రిమాండు ఈ రోజుతో ముగిసినందున కోర్టు ఆయన రిమాండును 19వ తేది వరకు పొడిగించింది.
మరోవైపు 2005లో మెదక్ జిల్లా కలెక్టర్‌ను దూషించిన కేసులో అక్బరుద్దీన్‌కు బెయిల్ మంజూరయింది. రూ.10వేల ధరావతు, ఇద్దరి పూచికత్తుతో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో అక్బరుకు బెయిల్ మంజూరయినా హేట్ స్పీచ్ కేసులో బెయిల్ రాలేదు.
సొంత పార్టీకి చెందిన శాసనసభ్యుడిని కలిసేందుకు మజ్లిస్ పార్టీ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ సోమవారం నిరాకరించారట. హిందువులు, దేశం పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టైన అక్బర్ అదిలాబాదు జిల్లా సబ్ జైలులో ఉన్నారు. సోమవారం ఆయనను కలిసేందుకు పార్టీకి చెందిన చార్మినార్ ఎమ్మెల్యే ఖాద్రీ పాషా వచ్చారు. అయితే ఆయనను కలిసేందుకు అక్బర్ నిరాకరించినట్లుగా జైలు అధికారులు చెప్పారు.
అయితే, ఖాద్రీ పాషా మాత్రం అక్బర్ నడవలేని స్థితిలో ఉన్నందున తాను కలవలేకపోయానని చెప్పారు. ఖాద్రీ అక్బరును చూసేందుకు హైదరాబాదు నుండి అదిలాబాదు జిల్లా జైలు వద్దకు చేరుకున్నారు. అక్బరుతో ఆయన కలువలేకపోయారు. అనంతరం ఆయన మాట్లాడారు. అక్బరు, మజ్లిస్ పార్టీ పైన రాజకీయ కుట్ర జరుగుతోందన్నారు. తమ పార్టీని బలహీనపర్చే కుట్రను ప్రభుత్వం చేస్తోందన్నారు. అయితే, తాము ప్రజల మద్దతుతో మరిన్ని ఎక్కువ సీట్లు కైవసం చేసుకుంటామని చెప్పారు.












Click it and Unblock the Notifications