వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరుగుదొడ్డిలో థర్డ్ క్లాస్ విద్యార్థినిపై టీచర్ అత్యాచారం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Class 3rd girl harassed by teacher
భోపాల్: మూడో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై ఓ ఉపాధ్యాయుడు మరుగుదొడ్డిలో అత్యాచారం చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. మధ్యప్రదేశ్‌లోని మాండ్లా గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఓ విద్యార్థిని మూడో తరగతి చదువుతోంది. అందులో ఆ సమయంలో ఆమె ఒక్కర్తే ఉంది. ఈ నెల రెండో తేదీన విద్యార్థిని పాఠశాలలో ఒక్కర్తే ఉంది. అదే సమయంలో ఉపాధ్యాయుడు ప్రేమ్ కుమార్ పాఠశాలకు వచ్చాడు.

ముక్కు చీదుకోవడానికి మరుగుదొడ్డిలోకి వెళ్లాల్సిందిగా ఆమెను ఆదేశించాడు. అనంతరం విద్యార్థినిని ఉపాధ్యాయుడు ప్రేమ్ కుమార్ ఆనుసరించాడు. మరుగుదొడ్డి తలుపు గొళ్లెం పెట్టి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ పోలీసు ఆర్ ఎఫ్ కాడ్లా చెప్పారు. ఇంటికి వచ్చాక విద్యార్థిని తల్లిదండ్రులు విషయం తెలుసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం ప్రేమ్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

మహిళలపై లైంగిక దాడి, హత్యకు మరణ శిక్ష

మరోవైపు మహిళలపై లైంగిక దాడికి పాల్పడి, వారి మరణం లేదా శాశ్వత అచేతనావస్థకు కారకులైనవారికి మరణమే శిక్షగా నేర చట్టాల (సవరణ) ఆర్డినెన్స్-2013 స్పష్టం చేస్తోంది. అంతేకాకుండా తీవ్రస్థాయి లైంగిక దాడి కేసులో శిక్షపడిన వ్యక్తి, మరోసారి అదే నేరం చేసినా మరణం లేదా 20 ఏళ్ల కారాగారం లేదా జీవితాంతపు జైలుశిక్ష విధించాలని నిర్దేశించింది. మూకుమ్మడి లైంగిక దాడికి పాల్పడిన అందరికీ ఇదే శిక్ష వర్తిస్తుందని, దీంతోపాటు బాధితులకు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.

ఈ మేరకు కేంద్రమంత్రులు చిదంబరం, మనీష్ తివారీ ఢిల్లీలో సోమవారం విలేకరులకు వెల్లడించిన కీలకాంశాలలో మరికొన్ని ఇలా ఉన్నాయి... యాసిడ్ దాడితో శాశ్వత లేదా పాక్షిక నష్టం కలిగిస్తే కనీసం పదేళ్ల జైలు తప్పదు. నేర తీవ్రతను బట్టి యావజ్జీవంతోపాటు రూ.10 లక్షల జరిమానా విధించే అవకాశం కూడా ఉంటుంది. దంపతులు వేరుపడిన సందర్భంలో భార్యపై లైంగిక దాడి (రేప్‌కు నిర్వచనం)కి పాల్పడే భర్తకు ఏడేళ్లదాకా శిక్ష విధించాలని పేర్కొంది.

English summary

 A Class 3rd girl student was allegedly harassed by a guest teacher in a scholl toilet at a village in Mandla district of Madhya Pradesh, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X