మూడంచెల్లో: తెలంగాణకు ప్రాంతీయ అభివృద్ధిమండలి?

ప్రాంతీయ అభివృద్ధి మండలి?
తెలంగాణ అంశంపై జోరుగా చర్చిస్తున్న కేంద్రం తెలంగాణకు ప్రాంతీయ అభివృద్ధి మండలి వేసే యోచనలో ఉందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తెలంగాణ, సీమాంధ్ర నేతల హెచ్చరికల నేపథ్యంలో ప్రాంతీయ మండలి వైపు మొగ్గు చూపిస్తోందనే వార్తలు వస్తున్నాయి. ప్రాంతీయ మండలికి భారీగా నిధులు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ విషయమై చర్చించేందుకు మూడు ప్రాంతాల ముఖ్య నేతలతోనూ అధిష్టానం భేటీ కానుందని అంటున్నారు.
మూడు ప్రాంతాల కాంగ్రెసు పార్టీ ముఖ్య నేతలతో భేటీ అనంతరం అధిష్టానం కేంద్రం ద్వారా తెలంగాణకు ప్రాంతీయ అభివృద్ధి మండలి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించే అవకాశాలు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే తెలంగాణ నేతలు దీనిని ఏ మేరకు అంగీకరిస్తారనేది అసలు ప్రశ్న.
మూడంచెల వ్యూహం సిద్దం?
తెలంగాణపై కాంగ్రెసు పార్టీ మూడంచెల వ్యూహాన్ని సిద్ధం చేసిందని అంటున్నారు. మొదట ప్రాంతీయ అభివృద్ధి మండలిని ప్రకటించనుందని అంటున్నారు. ఆ తర్వాత క్రమంగా తెలంగాణపై స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకునే దిశలో వెళ్లనుందని అంటున్నారు.
సోనియా నాయకత్వంలో ముందుకు
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెసు పార్టీ విజయవంతంగా ముందుకు వెళ్తుందని బొత్స అన్నారు. సహకార ఎన్నికల్లో తమ పార్టీ మంచి ఫలితాలు సాధించిందన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తున్న జిల్లాలో కూడా తమ పార్టీయే విజయం సాధించిందన్నరాు. తెలంగాణపై త్వరలో పరిష్కారం వస్తుందన్నారు. కాగా అధిష్టానం నుండి పిలుపు రావడంతో బొత్స రెండు మూడు రోజుల్లో ఢిల్లీ వెళ్లే అవకాశాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications