గవర్నర్ రాక: ముందే ఓయు హీట్, పిడిఎస్‌యు బంద్

79వ స్నాతకోత్సవానికి గవర్నర్ నరసింహన్‌తో పాటు ఇతర రాష్ట్రాలు, విశ్వవిద్యాలయాలకు చెందిన కులపతులు, ఉప కులపతులు రానున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని విద్యార్థి సంఘాలు తాము శాంతియుతంగా నిరసన తెలుపుతామని ప్రకటించాయి. తమ తెలంగాణ ఆకాంక్షను స్నాతకోత్సవం సందర్భంగా ఉద్రిక్తతకు తావు లేకుండా తెలియజేస్తామన్నారు. మరికొన్ని విద్యార్థి సంస్థలు మాత్రం గవర్నర్‌ను అడ్డుకుంటామని తెలిపాయి.
ప్రతిష్టకు సంబంధించినది
ఉస్మానియా విశ్వవిద్యాలయ 79వ స్నాతకోత్సవం ప్రతిష్టకు సంబంధించిన అంశమని ఓయు ఉప కులపతి అన్నారు. నిరసన కార్యక్రమాలు సరికాదన్నారు. ఈ స్నాతకోత్సవంలో పలువురు ముఖ్యులు పాల్గొంటారని చెప్పారు. రేపు స్నాతకోత్సవం దృష్ట్యా భద్రత విషయమై పోలీసులతో మాట్లాడినట్లు ఉప కులపతి చెప్పారు. విద్యార్థులు ఎవరు కూడా ఎవరినీ స్నాతకోత్సవం సందర్భంగా అడ్డుకోవద్దని కోరారు.
రేపు గవర్నర్ రాక సందర్భంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే భారీగా పోలీసు బలగాలను అక్కడ మోహరించారు. కాగా తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ, కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థులు కీలకంగా ఉంటుంటారు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఉస్మానియా పలుమార్లు హీటెక్కింది. ఇది ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది.












Click it and Unblock the Notifications