కేసులో టి సెగ: పొన్నాల ఉక్కిరిబిక్కిరి, విభజనపై అసద్

Ponnala Laxmaiah-Asaduddin Owaisi
హైదరాబాద్/మెదక్: ఐటి శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య శుక్రవారం ఉక్కిరి బిక్కిరి అయ్యారు! 2009లో ఎన్నికకు సంబంధించిన కేసులో పొన్నాల ఉదయం హైకోర్టుకు హాజరయ్యారు. ఈ సమయంలో పలువురు తెలంగాణ న్యాయవాదులు ఆయనను అడ్డుకున్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మంత్రులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తొత్తులుగా మారారని మండిపడ్డారు.

ఆ తర్వాత కేసు విషయంలో కోర్టుకు హాజరైన పొన్నాలను పిటిషనర్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తరఫు న్యాయవాదు పలు ప్రశ్నలు వేశారు. నాడు మంత్రి హోదాలో ఎన్నికల అధికారిని తాను ప్రభావితం చేయలేదని పొన్నాల వివరణ ఇచ్చారు. పొన్నాల వివరణ అనంతరం కోర్టు కేసును ఈ నెల 21వ తేదికి వాయిదా వేసింది.

తెలంగాణపై చెప్పాం: అసద్

తెలంగాణపై కేంద్రం సాధ్యమైనంత త్వరగా ఏదో ఒక అభిప్రాయం చెప్పాలని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాదు పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ శుక్రవారం అన్నారు. తెలంగాణ కోసం యువత ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణపై మజ్లిస్ పార్టీ అభిప్రాయాన్ని శ్రీకృష్ణ కమిటీకి, ప్రణబ్ ముఖర్జీ కమిటీలకు ఎప్పుడో చెప్పామని అన్నారు.

2005లో మెదక్ జిల్లా కలెక్టర్‌ను, జాయింట్ కలెక్టర్‌ను దూషించిన కేసులో అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీలు శుక్రవారం సంగారెడ్డి కోర్టుకు హాజరయ్యారు. కేసు విచారణలో భాగంగా వారు కోర్టుకు వచ్చారు. కోర్టు తదుపరి విచారణను ఈ నెల 22వ తేదికి వాయిదా వేసింది.

కోర్టుకు జగ్గారెడ్డి

సంగారెడ్డి మండలంలోని కందిలో జీపు దహనం, ఓ ఛానల్ విలేకరిని బెదిరించిన కేసులలో ప్రభుత్వ విప్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి మెదక్ జిల్లా సంగారెడ్డి కోర్టులో హాజరయ్యారు. వాదనలు విన్న న్యాయమూర్తి మొదటి కేసు విచారణను మార్చి 1వ తేదికి, రెండో కేసు విచారణను మార్చి 25వ తేదికి వాయిదా వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+