హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కిరణ్‌పై టిడిపి ఫైర్: జగన్ జైల్లో ఎ5 బయటా?: తెరాస

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gali Muddukrishnama Naidu
హైదరాబాద్: సహకార ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ గెలుపును ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విజయంగా కాకుండా ఓటమిగా చెప్పుకోవాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు శుక్రవారం అన్నారు. భారీ ఎత్తున బోగస్ ఓట్లను చేర్పించి, అక్రమాలకు పాల్పడి కాంగ్రెసు సొసైటీలను చేజిక్కించుకుందని ఆరోపించారు. నిజమైన రైతులంతా తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారన్నారు.

ప్రభుత్వానికి చేతనైతే వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. సహకార ఎన్నికల ద్వారా కాంగ్రెసు ప్రభుత్వం ప్రజా, రైతు వ్యతిరేక ప్రభుత్వంగా తేలిపోయిందన్నారు. రైతులు ఎవరూ రుణాలు చెల్లించవద్దని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఆరు నెలల్లో ఎన్నికలు వస్తాయన్నారు. టిడిపి అధికారంలోకి రాగానే రుణ మాఫీ చేస్తుందని చెప్పారు. రైతు రుణాలు మాఫీ చేస్తారా లేదా అనే విషయాన్ని చెప్పాల్సింది ముఖ్యమంత్రే అని, రుణ మాఫీ సాధ్యం కాదని చెప్పడం సరికాదన్నారు.

విద్యుత్ వినియోగదారుల హక్కులను కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కాలరాస్తోందని మరో నేత రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. డిస్కంల ప్రతిపాదనలకు గుడ్డిగా ఆమోదం తెలపడం సరికాదని అన్నారు. ప్రభుత్వ అసమర్థ విధనాల వల్లనే విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయన్నారు. ఛార్జీల పెంపుపై ఈఆర్‌సి ముందు తమ వాదనలు వినిపిస్తానని చెప్పారు.

ఎ1 జైలులో ఎ5 మంత్రివర్గంలోనా?

అక్రమాస్తుల కేసులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలులో ఉంటే అదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు మంత్రులుగా ఎలా ఉంటారని తెలంగాణ రాష్ట్ర సమితి నేత శ్రవణ్ కుమార్ ప్రశ్నించారు. ఎ1 జగన్ జైలులో ఉంటే ఎ5 ధర్మాన ప్రసాద రావు మంత్రివర్గంలో ఉండటం సరికాదన్నారు. ముఖ్యమంత్రి ధర్మానను పక్కన కూర్చుండబెట్టుకుంటే కంచె చేను మేసినట్లుగా కనిపిస్తోందన్నారు. అవినీతి మంత్రులను కిరణ్ వెనుకేసుకొస్తున్నారని ధ్వజమెత్తారు.

English summary
Telugudesam and TRS are questioning CM Kiran Kumar Reddy about co-operative elections and YS Jaganmohan Reddy case arrests.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X