వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిరూపిస్తే కాళ్లు పట్టుకుంటా, లేకపోతే నా కాళ్లు..: షర్మిల

By Pratap
|
Google Oneindia TeluguNews

Sharmila
నల్లగొండ: తన కాలికి ఆపరేషన్ జరగలేదని తెలుగుదేశం పార్టీ నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు చేసిన ఆరోపణపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సోదరి షర్మిల తీవ్రంగా ప్రతిస్పందించారు. ఆమె పాదయాత్ర శుక్రవారం నల్లగొండ జిల్లాలోకి ప్రవేశించింది. దేవరకొండ శానససభా నియోజకవర్గం మాల్‌లో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. తన కాలికి శస్త్రచికిత్స జరగలేదని తెలుగుదేశం పార్టీ నాయకులు నిరూపిస్తే తాను వాళ్ల కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరుతానని, శస్త్రచికిత్స జరిగిందని తాను నిరూపిస్తే వాళ్లు తన కాళ్లు పట్టుకోవాలని ఆమె సవాల్ చేశారు.

బిడ్డ వయస్సున్న తనపై తెలుగుదేశం నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె అన్నారు. తన మోకాలి గాయంపై కూడా తెలుగుదేశం రాజకీయం చేస్తోందని ఆమె అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి పాదయాత్ర బూటకమని, ఫ్యాన్లు నెత్తిన పెట్టుకుని చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగానే కాదు, ప్రతిపక్ష నేతగా కూడా పనికి రారని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించకపోవడమే అందుకు నిదర్సనమని ఆమె అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు తొమ్మిదేళ్లు పాలించారని, చంద్రబాబు పాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న శాపమని షర్మిల అన్నారు. అధికార కాంగ్రెసు పార్టీతో చంద్రబాబు కుమ్మక్కయ్యారని ఆమె ఆరోపించారు. ప్రభుత్వంపై చంద్రబాబు ఎందుకు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడం లేదని ఆమె అన్నారు. రాష్ట్రంలోని రైతులకు కనీసం కిరణ్ ప్రభుత్వం భరోసా కల్పించలేకపోతోందని ఆమె అన్నారు. సొంత ఊరిపై ఉన్న ప్రేమ కిరణ్ కుమార్ రెడ్డికి రాష్ట్రంపై లేదని ఆమె అన్నారు.

చంద్రబాబు దర్సకత్వంలో బిజెపి నాటకం ఆడుతోందని, తన భర్త అనిల్ కుమార్‌పై బిజెపి ఆరోపణలే అందుకు నిదర్సనమని అన్నారు. తాము మతాన్ని వాడుకుంటున్న వస్తున్న ఆరోపణలపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. చేతకాని పిరికి పందలే మతాన్ని వాడుకుంటారని ఆమె అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబం ఎప్పుడు కూడా మతాన్ని రాజకీయాలకు వాడుకోలేదని ఆమె అన్నారు.

నల్లగొండ జిల్లాకు నీళ్లు అందించే ప్రాజెక్టులను ప్రభుత్వం మూలన పడేసిందని, వైయస్ బతికి ఉంటే ఆ ప్రాజెక్టులు పూర్తయ్యేవని ఆమె అన్నారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే ప్రాజెక్టులను పూర్తి చేస్తారని, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు నీళ్లు అందించే ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తారని ఆమె చెప్పారు.

English summary
YSR Congress president YS Jagan's sister Sharmila has challenged Telugudesam party leaders on allegations made against her surgery.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X