వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెజిస్ట్రేట్ ఇంటిపై కేంద్రమంత్రి వీరంగం!: బుద్దదేవ్‌కి నోటీస్

By Srinivas
|
Google Oneindia TeluguNews

West Bengal
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో కేంద్రమంత్రి ఒకరు జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయం వద్ద తన అనుచరులతో కలిసి వీరంగం సృష్టించారు. కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, కేంద్రమంత్రి అధిర్ రంజన్ నాయకత్వంలో పలువురు కాంగ్రెసు కార్యకర్తలు గురువారం ముర్షీదాబాద్ జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయానికి వెళ్లారు. మెజిస్ట్రేట్‌కు వినతి పత్రం ఇచ్చేందుకు అధిర్ వెళ్లారు. కార్యకర్తలతో కలిసి ఆయన వెళ్లిన సమయంలో మెజిస్ట్రేట్ లేరు.

దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అధిర్ అనుచరులు అక్కడ విధ్వంసం సృష్టించారు. మెజిస్ట్రేట్ నివాసంతో పాటు ఆయన కారును ధ్వంసం చేశారు. దాడి వార్తలపై స్పందించిన కేంద్రమంత్రి రంజన్ చౌదరి.. మీడియా చూపినంత విధ్వంసం అక్కడేమీ జరగలేదని చెప్పారు. పోలీస్ కస్టడీ మరణానికి కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారని తెలిపారు. మెజిస్ట్రేట్ వైఖరి పట్ల తమ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారన్నారు. అయినా కార్యకర్తలు ఎక్కడా హద్దుమీరలేదని వివరణ ఇచ్చారు. ఈ దాడిని అధికార తృణమూల్ కాంగ్రెసు పార్టీ తీవ్రంగా ఖండించింది.

బుద్దదేవ్‌కు నోటీసులు

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్దదేవ్ భట్టాచార్యకు తృణమూల్ కాంగ్రెసు పార్టీ లీగల్ నోటీసును పంపించింది. ముఖ్యమంత్రి, తమ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ నిజాయితీ గురించి మాట్లాడటంపై తృణమూల్ ఆయనకు నోటీసులు పంపించింది. దీనిపై వెంటనే ఆయన 48 గంటల్లో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. లేదంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది.

తమ అధినేత్రి నిజాయితీని ప్రశ్నించినందుకు తాము బుద్దదేవ్‌కు నోటీసులు పంపించామని, క్షమాపణ చెప్పాలని అడిగామని, లేదంటే కోర్టుకు వెళ్తామని తృణమూల్ కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి ముకుల్ రాయ్ మీడియాతో చెప్పారు. కాగా బెంగాలీ టివి న్యూస్ ఛానల్ ముఖాముఖి కార్యక్రమంలో బుద్దదేవ్ మంగళవారం మాట్లాడుతూ... మమతా బెనర్జీ నిజాయితీ కలిగిన వ్యక్తి అనే మాటలతో తాను ఏకీభవించనని చెప్పారు.

English summary
In a shocking incident in West Bengal, workers of the Congress party trashed the home of the District Magistrate of Murshidabad, led by no less than Union Minister of State for Railways, Adair Ranjan Chowdhary. He further defended himself saying the DM had affronted state Congress leaders and the rampaging workers were within their rights.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X