చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్టాలిన్Xఅళగిరి: డిఎంకెలో ఖుష్బూ హీట్, నటిపైనా దాడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Khushboo
చెన్నై: డిఎంకె నేత, సినీ నటి ఖుష్బూ ఇంటి పైన చెన్నైలో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఖుష్బూ ఇటీవల వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం ఎయిడ్స్ పైన అవగాహన కార్యక్రమంపై మాట్లాడుతూ.. పెళ్లికి ముందు మహిళలు సెక్సులో పాల్గొనడం సరైనదేనని ఆమె అన్నారు. అయితే, గర్భం రాకుండా, ఎయిడ్స్ లాంటి వ్యాధుల బారిన పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఆ తర్వాత మరోసారి ప్రస్తుతం సమాజంలో భార్యను కాని, గర్ల్ ఫ్రెండును కాని కన్యగా మగవాళ్లు ఆశించకూడదని అన్నారు. మరో సమయంలో ఓ ఆడియో విడుదల కార్యక్రమానికి హిందూ దేవతలు అయిన శ్రీరాముడు, కృష్ణుడు, హనుమంతుడి బొమ్మలున్న చీరను కట్టుకొని హాజరయ్యారు. దీనిపై హిందూ మత సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. తాజాగా డిఎంకె అధ్యక్షుడి అంశంపై ఓ ఛానల్లో మాట్లాడటంతో సొంత పార్టీ కార్యకర్తల ఆగ్రహానికి ఆమె గురయ్యారు.

గురువారం ఉదయం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఇంటి వద్దకు చేరుకొని రాళ్ల దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత సాయంత్రం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఖుష్బూ పైనా కార్యకర్తలు దాడి చేశారు. స్టాలిన్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు ఓసభలో పాల్గొన్న ఆమెపై కార్యకర్తలు రాళ్లు, చెప్పులతో దాడి చేశారు. ఖుష్బూ డిఎంకె వ్యతిరేకి, స్టాలిన్ వ్యతిరేకి అంటూ నినాదాలు చేశారు. అయితే, ఈ దాడి నుండి ఆమె తృటిలో తప్పించుకున్నారు.

అంతకుముందు ఇంటిపై దాడి చేశారు. ఖుష్బూ క్షమాపణ చెప్పాలని స్టాలిన్ వర్గం కార్యకర్తలు నినాదాలు చేశారు. దీనిపై ఆమె వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన వ్యాఖ్యలను వారు అపార్థం చేసుకున్నారని ఖుష్బూ ఆవేదన వెలిబుచ్చారు. తాను స్టాలిన్‌కు వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. పార్టీకి తాను విశ్వాసపాత్రురాలినని, పార్టీ నేతల ఆజ్ఞను శిరసావహిస్తానని అన్నారు.

ఖుష్బూ అసలేమన్నారు?

డిఎంకె కార్యకర్తల ఆగ్రహానికి ఖుష్బూ గురైన విషయం తెలిసిందే. డిఎంకె భవిష్యత్తు నేతను కరుణానిధి ఒక్కరు ఎన్నుకుంటేనో, నిర్ణయిస్తేనో కుదరదని, పార్టీలో ఏ చిన్న పదవైనా సంస్థాగత ఎన్నికలు అనివార్యమని, గెలుపొందిన వారే పదవుల్ని పొందుతారని, డిఎంకె అధ్యక్షుడి ఎన్నిక కూడా అలాగే ఉంటుందని ఖుష్బూ అన్నారు. ఈ వ్యాఖ్యలే స్టాలిన్ వర్గానికి ఆగ్రహాన్ని తెప్పించాయి. కాగా ప్రస్తుతం డిఎంకెలో ఖుష్బూ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

గత కొంతకాలంగా డిఎంకెలో వారసత్వ పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కరుణానిధి తన రెండో తనయుడు స్టాలిన్ వైపు మొగ్గు చూపారు. దీంతో అళగిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, తాను స్టాలిన్‌ను అధ్యక్షుడిగా అంటూ సంకేతాలు ఇవ్వలేదని చెబుతూనే మరోసారి ఆయన వైపే మొగ్గుచూపుతున్నట్లు ఓ కార్యక్రమంలో కరుణానిధి మాట్లాడారు. స్టాలిన్, అళగిరి మధ్యన అధ్యక్షుడి పదవి చిచ్చు రగులుతుండగానే ఖుష్బూ వ్యాఖ్యలు పార్టీలో మరింత వేడెక్కించాయి.

English summary
Attack on Khushboo's house: Actor-turned politician Kushboo's house was allegedly vandalized by her own party members after her remark on Stalin in a Tamil magazine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X