అఫ్జల్ గురు ఉరికి నిరసన, ధర్నా: వరవరరావు అరెస్టు

ఇదిలావుంటే, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై వరవరరావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మోడీపై హైదరాబాదులోని సరూర్‌నగర్‌లో జరిగిన తెలంగాణ విద్యావంతుల వేదిక సమావేశంలో వరవరరావు మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాంతో బిజెపి కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ వరవరరావు ప్రసంగాన్ని అడ్డుకున్నారు. వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.
దాదాపు 3 వేల మందిని ఊచకోత కోసిన నరేంద్ర మోడీని దేశ ప్రధానిగా చేయడానికి సాధువులు, సన్యాసులు ప్రయత్నిస్తున్నారని వరవరరావు వ్యాఖ్యానించారు. కాంగ్రెసు ప్రభుత్వం బిజెపితో పోటీ పడి అజ్మల్ కసబ్‌ను, అఫ్జల్ గురును ఉరి తీసిందని ఆయన విమర్శించారు. నిజాం ప్రభుత్వ కాలంలో కన్నా, నక్సలైట్ ఉద్యమంలో కన్నా ఎక్కువ మంది నరేంద్ర మోడీ పాలనలో మరణించారని ఆయన అన్నారు.
నక్సలైట్లు ద్రోహులు, మోడీ ప్రధాని కావాలా అని వరవరరావు ప్రశ్నించారు. అఫ్జల్ గురును వరవరరావు ఉద్యమకారుడిగా అభివర్ణించారు. అఫ్జల్ గురుకు ఉరిశిక్ష విధించడం అమానుషమని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలకు కూడా సభలో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.












Click it and Unblock the Notifications