కులరాజకీయమొద్దు, ఆవేదన పట్టదా?: గ్రీన్‌ఫీల్డ్ విక్టిమ్స్

ఆయనకు మద్దతిస్తున్న దళిత నాయకులు తమ గురించి పట్టించుకోరా అని ప్రశ్నించారు. ఓ ఎమ్మెల్యే భూకబ్జాను పార్టీలు ప్రశ్నించవా అన్నారు. శంకర రావును వెంటనే అరెస్టు చేసి తమ భూములు తమకు అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. తాము గత ముప్పయ్యేళ్లుగా ప్లాట్ల కోసం పోరాడుతుంటే ఏ నాయకుడూ పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రీన్ ఫీల్డ్ వ్యవహారాన్ని కుల రాజకీయం చేయవద్దన్నారు.
గ్రీన్ ఫీల్డ్ భూముల వ్యవహారంలో బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. శంకర రావుకు దళితుల నేతలు మద్దతివ్వడం సరికాదన్నారు. శంకర రావుకు అనేక భూ ఆక్రమణలతో సంబంధముందని వారు ఆరోపించారు. ప్రభుత్వం అధికారులతో సర్వే చేయిస్తే అసలు నిజాలు బయటపడతాయన్నారు. ప్రభుత్వానికి చేతకాకపోతే గ్రీన్ ఫీల్డ్ వ్యవహారాన్ని సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.
కాగా మాజీ మంత్రి, కంటోన్మెంటు శాసనసభ్యుడు శంకరరావు కూతురు సుష్మిత బుధవారం నేరెడ్‌మెట్ పోలీసులపై ముషీరాబాదు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. నేరెడ్‌మెట్ పోలీసులు తన తండ్రి శంకరరావును విచారణ కోసమంటూ తీసుకెళ్లే సమయంలో దురుసుగా ప్రవర్తించారని ఆమె ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ముషీరాబాద్ పోలీసులు సుష్మిత ఫిర్యాదును స్వీకరించారు. తన తండ్రికి గ్రీన్ ఫీల్డ్ భూముల వ్యవహారంతో సంబంధం లేదన్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications