వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉరితీత: రెండ్రోజుల తర్వాత కుటుంబానికి అందిన లేఖ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Afzal Guru
శ్రీనగర్: పార్లమెంటు దాడి కేసులో నిందితుడు అఫ్జల్ గురు ఉరితీత జరిగిన రెండు రోజుల తర్వాత అతని ఫ్యామిలికీ అందుకు సంబంధించిన లేఖ అందింది. అఫ్జల్ గురు ఉరి శిక్ష అమలుపై అతని కుటుంబానికి సమాచారమిస్తూ ప్రభుత్వం పంపిన లేఖ అతని కుటుంబానికి సోమవారం అందింది. అఫ్జల్ గురును శనివారం ఉదయమే తీహార్ జైలులో ఉరి తీశారు. అంతకుముందే అధికారులు అఫ్జల్ కుటుంబానికి సమాచారమిస్తూ లేఖ రాశారు.

దానిని స్పీడ్ పోస్టు చేశారు. కానీ, అది ఈ రోజు అతని కుటుంబానికి అందింది. అఫ్జల్ ఉరి తీత విషయం అతని కుటుంబానికి సమాచారం ఇచ్చామని ప్రభుత్వం, ఇవ్వలేదని కుటుంబ సభ్యులు వాదిస్తున్న నేపథ్యంలో ఇవాల లేఖ అందడం గమనార్హం. అఫ్జల్ గురు ఉరిని తమకు తెలియజేయలేదని కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు ఆరోపించారు. అధికారులు మాత్రం తాము స్పీడ్ పోస్టు చేశామని తెలిపారు. మరోవైపు కాశ్మీరులో మూడో రోజు కూడా కర్ఫ్యూ కొనసాగుతోంది.

కాగా పార్లమెంటుపై దాడి కేసులో అఫ్జల్ గురుకు ఉరిశిక్ష అమలు జరపడాన్ని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా తప్పు పట్టిన విషయం తెలిసిందే. ఈ సంఘటన కాశ్మీర్ లోయలోని యువతలో తాము పరాయివారమన్న భావనను కలిగిస్తుందని, ఉరి అమలు అన్యాయమని ఆయన అన్నారు. రాజీవ్ గాంధీ, బియాంత్ సింగ్ హంతకులకు మరణ శిక్షను అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ ఎందుకు డిమాండ్ చేయడం లేదని నిలదీశారు. అఫ్జల్‌ను ఉరి తీయకుండా ఉండి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

ఉరితీసే ముందు అఫ్జల్‌ను కలుసుకునేందుకు, ఆ తర్వాత అతని అంత్యక్రియలకు అఫ్జల్ కుటుంబ సభ్యులను అనుమతించక పోవడం సరికాదన్నారు. అఫ్జల్ ఉరి విచారకరమని, దీని ప్రభావం దీర్ఘకాలంగా ఉంటుందని, పలు ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉందని ఓమర్ అన్నారు. కాశ్మీరులోని ఓ తరం ప్రజలు తమని తాము బాధితులుగా భావిస్తున్న విషయం అర్థం చేసుకోవాలన్నారు. కాశ్మీరు యువతకు అక్బర్ ఉరి ఆగ్రహాన్ని కలిగించవచ్చునన్నారు.

English summary
Two days after he was executed in Delhi, Afzal Guru's family received a letter this morning disclosing that he was to be hanged for his role in the 2001 attack on parliament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X