• search
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పిక్చర్స్: కుంభమేళాకు భక్తులు ఇలా పోటెత్తారు

By Pratap
|

అలహాబాద్: పవిత్ర మౌని అమావాస్య సందర్భంగా మహా కుంభమేళా త్రివేణి సంగమం భక్తులతో ఆదివారం పోటెత్తింది. పుణ్యస్నానాలు ఆచరించడానికి మూడు కోట్ల మందికి పైగా భక్తులు వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. అయితే, తొక్కిసలాట జరిగి 36 మంది మరణించిన సంఘటన విషాదం నింపింది.

హిందూ మతంలోని వివిధ తెగలకు చెందిన సాధువుల సారథ్యంలో మూడు కోట్ల మందికిపైగా భక్తులు ఈ సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించి తమ భక్తిప్రపత్తులను చాటుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకే అంచనాలను మించి మూడు కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని, ఆ తర్వాత భక్తజన ప్రవాహం కొద్దిగా తగ్గిందని కుంభమేళా అధికారి మణిప్రసాద్ మిశ్రా ఓ వార్తా సంస్థకు తెలిపారు. మహా కుంభమేళా సందర్భంగా ఆరు వేల ఎకరాల్లో విస్తరించిన గుడారాలతో అలహాబాద్ నగరం ప్రపంచంలోనే అత్యంత జనసమ్మర్ధ ప్రాంతంగా నిలిచింది.

పవిత్ర గంగా, యమున, సరస్వతి నదులు సంగమించే త్రివేణి వద్ద పుణ్యస్నానాలు ఆచరించేందుకు కోట్లాది మంది భక్తజనులు ఉప్పెనలా తరలి వచ్చారు. అలాగే మహా కుంభమేళా సందర్భంగా రెండోసారి ‘సాహీ సాన్నాలు' ఆచరించేందుకు 13 అఖారాలకు చెందిన సాధువులు ప్రదర్శనగా తరలివచ్చారు.

విదేశీ భక్తులు సైతం ఈ కార్యక్రమాలకు హాజరై భారత సంస్కృతీసాంప్రదాయాల పట్ల తమకు గల భక్తిప్రపత్తులను చాటుకున్నారు. ఈ సందర్భంగా భక్తజనకోటి ‘హర హర గంగా' అంటూ చేసిన నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది. వాస్తవానికి వౌని అమావాస్య పర్వదినం శనివారం మధ్యాహ్నం నుంచే ప్రారంభం కావడంతో భక్తులు నిన్నటి నుంచే పుణ్యస్నానాలు ఆచరించడం మొదలుపెట్టారు.

పిక్చర్స్: కుంభమేళాకు ఇలా పోటెత్తారు

పవిత్ర మౌని అమావాస్య సందర్భంగా అలహాబాద్‌లోని మహా కుంభమేళాలో గంగానదిలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్న భక్తులు.

పిక్చర్స్: కుంభమేళాకు ఇలా పోటెత్తారు

మౌని అమావాస్య సందర్భంగా త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానం ఆచరించడానికి వస్తున్న స్వామి నిత్యానంద.

పిక్చర్స్: కుంభమేళాకు ఇలా పోటెత్తారు

పవిత్ర గంగానదిలో పుణ్య స్నానం ఆచరించడానికి గుమిగూడిన అఖడ నాగ సాధువులు.

పిక్చర్స్: కుంభమేళాకు ఇలా పోటెత్తారు

పవిత్ర గంగానదిలో పుణ్య స్నానాలు అచరించడానికి భక్తజన కోటి..

పిక్చర్స్: కుంభమేళాకు ఇలా పోటెత్తారు

పవిత్ర మౌని అమావాస్య సందర్భంగా గంగానదిలో స్నానం చేయడానికి రాజేందర్ ప్రసాద్ ఘాట్ వద్ద గుమిగూడిన భక్తులు...

పిక్చర్స్: కుంభమేళాకు ఇలా పోటెత్తారు

మౌని అమావాస్య సందర్భంగా గంగానదిలో స్నానం చేయడానికి గుమిగూడిన జున నాగ సాధువులు.

పిక్చర్స్: కుంభమేళాకు ఇలా పోటెత్తారు

మౌని అవావాస్య సందర్భంగా ట్రస్టీ ఏర్పాటు చేసిన సామూహిక భోజనాల్లో పంక్తి భోజనాలు చేస్తున్న భక్తులు..

పిక్చర్స్: కుంభమేళాకు ఇలా పోటెత్తారు

ఆదివారం తెల్లవారుజామునే పుణ్య స్నానం ఆచరించడానికి ముందు తన తలవెంట్రుకలను ప్రదర్శిస్తున్న సాధువు.

పిక్చర్స్: కుంభమేళాకు ఇలా పోటెత్తారు

పవిత్ర స్నానం ఆచరించడానికి వంతెనపై నుంచి నడిచి వెళ్తున్న వేలాది మంది భక్తులు..

పిక్చర్స్: కుంభమేళాకు ఇలా పోటెత్తారు

పుణ్య స్నానాలు ఆచరించడానికి వచ్చిన భక్తజనాన్ని చూడడానికి వెదురు బారికేడ్‌పై కూర్చున్న ఓ విదేశీ యాత్రికురాలు..

దేశ, విదేశాల నుంచి అసంఖ్యాకంగా పోటెత్తిన భక్తులతో అలహాబాద్‌తో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని అన్ని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, రోడ్లు కిటకిటలాడాయి. నాగ సాధువులు వచ్చి చేరుతూనే ఉన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

lok-sabha-home

English summary
Lakhs of devotees reached the bathing ghats here for a holy dip on the auspicious occasion of 'Mauni Amavasya' today in the ongoing Maha Kumbh congregation at the holy Sangam. The day also marks the second 'Shahi Snan' of sadhus belonging to various 'Akharas'. According to a rough estimate by officials, the number of people to have taken a dip by the crack of dawn appears to be "not less than 20 lakhs" and the final turnout may exceed the projected estimate of three crore.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more