సయిద్‌తో కలిసి వేదికపై యాసిన్: అఫ్జల్ గురుకు నివాళి
ఇస్లామాబాద్: వేర్పాటువాద జెకెఎల్ఎఫ్ నేత యాసిన్ మాలిక్ ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌తో కలిసి వేదికను పంచుకున్నారు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో పార్లమెంటుపై దాడి కేసులో ఉరిశిక్ష అనుభవించిన అఫ్జల్ గురుకు నివాళులు నివాళులు అర్పించే వేదికపై ఇద్దరు కలిసి ఉన్నారు. వారిద్దరు కలిసి ఉన్న ఛాయాచిత్రాలను మీడియా ప్రచురించింది.
అఫ్జల్ గురు ఉరితీతను నిరసిస్తూ మాలిక్‌తో పాటు ఆయన అనుచరులు కొంత మంది 24 గంటల దీక్షను చేపట్టారు. గురు ఉరితీత నేపథ్యంలో భారత ఖైదీ సరబ్జిత్ సింగ్ విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని మాలిక్ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరారు.
హోం మంత్రిత్వ శాఖ నుంచి వివరాలు తెప్పించుకుని మాలిక్ సయీద్‌తో వేదికను పంచుకున్న విషయాన్ని పరిశీలిస్తానని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ తమతో అన్నట్లు ఓ మీడియా మాధ్యమం రాసింది.

మాలిక్ వ్యవహారం చాలా ముందుకు వెళ్లిందని, మాలిక్ వ్యవహారాలపై భారత ప్రభుత్వం పరిశీలిస్తోందని ఆ మీడియా సంస్థ రాసింది. సయీద్‌తో మాలిక్ వేదికను పంచుకున్న విషయంపై తాము పరిశీలన చేస్తామని భారత హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు.












Click it and Unblock the Notifications