టచ్‌లో ఉన్నారు, నవ్వుతూ షిండే వ్యంగ్యం: కెటిఆర్

నెల రోజుల్లోగా తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని చెప్పిన మాటను తప్పినందుకు సుశీల్ కుమార్ షిండే కనీసం పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయలేదని, పైగా ముసిముసి నవ్వులు విసురుతూ వ్యంగ్యంగా మాట్లాడారని, ఇది తెలంగాణపై సుశీల్ కుమార్ షిండేకు ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోందని ఆయన అన్నారు. తెలంగాణపై నిర్ణయానికి కాలపరిమితి లేదని, తెలంగాణపై ఫైలును మూసేయలేదని సుశీల్ కుమార్ చెప్పడాన్ని ఆయన వ్యతిరేకించారు.
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ నాన్చుడు ధోరణికి సుశీల్ కుమార్ షిండే వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో, తెలంగాణ ప్రజల ప్రాణాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని కెటిఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తెలంగాణ ప్రజా ప్రతినిధులు ప్రజల్లోకి వచ్చి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ కాంగ్రెసు ప్రజాప్రతినిధులు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తెలంగాణపై తెలంగాణ ప్రజలు కచ్చితమైన నిర్ణయాన్ని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా కాంగ్రెసు ప్రజా ప్రతినిధులు ఏ విధంగా వ్యవహరిస్తారో ప్రజలు గమనిస్తారని ఆయన అన్నారు. తెలంగాణపై ఎందుకు మాట తప్పారో సుశీల్ కుమార్ షిండే ప్రజలకు వివరణ ఇవ్వాలని ఆయన అన్నారు.
కాంగ్రెసు ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెంచేందుకు తెలంగాణ జెఎసి ప్రకటించిన కార్యాచరణలో తాము చురుగ్గా పాల్గొంటామని చెప్పారు. తమ పార్టీ కార్మిక విభాగం ఫిబ్రవరి 21, 22 తేదీల్లో తలపెట్టిన సార్వత్రిక సమ్మె గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. దేశవ్యాప్త సమ్మెకు తమ పార్టీ మద్దతు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications