వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియా ఇంటర్వ్యూతో: లగడపాటిపై పయ్యావుల కేశవ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Lagadapati Rajagopal - Payyavula Keshav
హైదరాబాద్/విశాఖపట్నం: కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తన రాజకీయ అస్తిత్వం కోసమే సమైక్యాంధ్ర నినాదం ఎత్తుకున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ మంగళవారం అన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇంటర్వ్యూతో రాజగోపాల్ ఇక్కడ హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. విభజన అంశంపై వివాదాలకు బడ్జెట్ సమావేశాలు వేదిక కాకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.

విభజన అంశంపై సమావేశాల్లో ప్రత్యేకంగా రెండు మూడు రోజులు చర్చించాలని డిమాండ్ చేశారు. విభజన విషయంలో సీమాంధ్ర ప్రజల్లో ఇప్పటికీ అభద్రత భావం నెలకొని ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ విషయంలో కేంద్రం నుండి అస్పష్టమైన ప్రకటనలు వస్తున్నాయని ఆయన ఆరోపించారు.

దాడులు సంప్రదాయం కాదు

దాడులు తమ సంప్రదాయం కాదని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ విశాఖపట్నంలో అన్నారు. ఆయన సమైక్యాంధ్ర బస్సు యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో బస్సు యాత్ర చేపడుతున్నట్లు చెప్పారు. దాడులు చేసేందుకు తమది ఆ సంప్రదాయం కాదని ఆయన చెప్పారు.

తెలంగాణపై షిండే మాట ఎందుకు తప్పారు?

నెల రోజుల్లో తెలంగాణ సమస్యకు పరిష్కారం చూపిస్తామని చెప్పిన కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే మాటను ఎందుకు తప్పారో చెప్పాలని తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు హైదరాబాదులో అన్నారు. మొదట నెల రోజులు గడువు చెప్పిన ఆయన ఇప్పుడు గడువు లేదని చెప్పడం సరికాదన్నారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెంచేందుకు ఐకాస కార్యక్రమాల్లో పాల్గొంటామన్నారు.

English summary

 Telugudesam Party senior leader Payyavula Keshav demand debate on Telangana issue in sessions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X