కాలేజ్ ఎన్నికల్లో ఫైరింగ్, ఎస్సైమృతి: అసోంలో 11మంది

ఇది ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘటనలో తపస్ చక్రవర్తి అనే స్పెషల్ బ్రాంచ్ పోలీసు గాయాలై మృతి చెందినట్లుగా సమాచారం. బయటి వ్యక్తుల కారణంగానే ఈ ఘటన జరిగిందని టిఎంసి మంత్రి బాబీ హకీమ్ చెప్పారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులతో పాటు భారీగా రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను మోహరించారు. కాంగ్రెసు, టిఎంసి వర్గాలు ఒకరి పై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు లాఠీఛార్జ్, కాల్పులు జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు.
అస్సాం పంచాయతీ ఎన్నికల్లో ఘర్షణ, 11 మంది మృతి
అస్సాంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు ఉద్రిక్తతకు దారి తీశాయి. ఈశాన్య రాష్ట్రంలోని అస్సాంలో పంచాయతీ ఎన్నికలను స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ఈ ఎన్నికలను వారు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. ఇది ఉద్రిక్తతకు దారి తీసింది. ఘర్షణలో పదకొండు మంది మృతి చెందారు.
పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉందని, పదకొండు మంది మృతి చెందినట్లుగా తమకు సమాచారం ఉందని, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డట్లుగా తెలుస్తోందని సీనియర్ పోలీసు అధికారు భూపెన్ బోరా చెప్పారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!