పారిపోయేందుకు జైల్లో సొరంగం: సబర్మతిలో దుశ్చర్య

Sabarmati Central Jail
అహ్మదాబాద్: అహ్మదాబాదు బాంబు పేలుళ్ల నిందితులు జైలు నుండి పారిపోయే దుశ్చర్యకు పాల్పడ్డారు. అహ్మదాబాదు పేలుళ్ల కేసు నిందితులు సబర్మతి జైలులో ఉంటున్నారు. అయితే, వారు జైలు నుండి తప్పించుకునేందుకు రెండు నెలల్లో 18 అడుగుల మేర సొరంగం తవ్వారు. అధికారులు గుర్తించడంతో వారి పన్నాగం విచ్ఛిన్నమయింది. దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

నిందితుల్లో ఒకడు సివిల్ ఇంజనీర్. మిగతా వారితో కలిసి జైలు నుండి పారిపోవాలని భావించాడు. దాంతో ఇంజనీర్ ఖైదీ తనకు తెలిసిన విద్యతో మాస్టర్ ప్లాన్ వేశాడు. దాన్ని తోటి ఖైదీలు అమలు చేశారు. దేశంలోనే సంచలనం సృష్టించిన అహ్మదాబాద్ సీరియల్ బాంబు పేలుళ్ల కేసు నిందితులు జైల్లో ఇలాంటి దుశ్చర్యకు పాల్పడటం గమనార్హం.

2008 జూలై 26 అహ్మదాబాద్‌లో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ కేసులో 68 మంది నిందితుల్లో 14 మందిని అహ్మదాబాద్‌లోని సబర్మతి జైలులో నిర్బంధించారు. ఆదివారం రాత్రి ఇద్దరు ఖైదీల ప్రవర్తన అనుమానాస్పదంగా అనిపించింది. జైలు భద్రతా సిబ్బంది పరిశీలించేసరికి సొరంగ మార్గం వెలుగు చూసింది. దీనిపై గుజరాత్ హోంశాఖ సహాయ మంత్రి రజనీకాంత్ పటేల్ విచారణకు ఆదేశించారు.

నిందితులు 18 అడుగులు తవ్వడానికి సుమారుగా 2 నెలలు పట్టిందట. భోజన ప్లేట్లు, చెక్క ముక్కల సాయంతో తవ్వి ఉంటారని జైళ్ల శాఖ ఐజి పిసి ఠాకూర్ చెప్పారు. జైలు గది బయట గార్డెనింగ్ పనిలో వారు వలంటీర్లుగా పాల్గొంటున్నారని.. తవ్వగా వచ్చిన మట్టిని అక్కడ పోసి ఉండొచ్చరన్నారు. నిందితు ల్లో సాజిద్ మన్సూరి, యూనస్ మన్సూరి, షమ్షూద్ షాపుర్వా లా, జావెద్ షేక్, కాద్రి జుహపుర్వాలా, ఆరిఫ్ కాద్రి, ఉమర్ కాలా, ఉస్మాన్ అగర్‌బత్తి, కయాముద్దీన్, ముఫ్తీ అబూ బాషర్ ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+