సూర్యనెల్లి రేప్ కేసు: సోనియాకు కురియన్ లేఖ

సూర్యనెల్లి సామూహిక అత్యాచారం కేసులో కురియన్ పాత్ర ఉందని ఆరోపణలు వచ్చాయి. దీంతో కురియన్ రాజీనామాకు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. సోనియాకు రాసిన లేఖ తమ పార్టీ అంతర్గత వ్యవహారమని, తాను లేఖలో రాసిన విషయాలను వెల్లడించలేనని కురియన్ చెప్పారు.
సూర్యనెల్లి గ్యాంగ్ రేప్ కేసులో నిందితుడైన ధర్మరాజన్ - కురియన్ పాత్ర ఉందంటూ బాధితురాలు ఆరోపించిన విషయాన్ని గుర్తు చేశాడు. ఈ కేసులో బెయిల్ లభించిన తర్వాత అతను అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అయితే, అతను ఓ టెలివిజన్ చానెల్‌తో మాట్లాడాడు. కురియన్ పేరు చెప్పవద్దని తనను కేసు ప్రధాన దర్యాప్తు అధికారి తనపై ఒత్తిడి తెచ్చాడని అతను ఆరోపించాడు.
ధర్మరాజన్ ఆరోపణలను కురియన్ ఖండించారు. సుప్రీంకోర్టు ఇప్పటికే కేసును తేల్చేసిందని, కేసులో నిందితుడు దోషిగా తేలిన తర్వాత చేసిన ఆరోపణలకు విలువ ఉండదని ఆయన అన్నారు. న్యాయమూర్తి ముందు వాంగ్మూలం ఇవ్వడానికి ప్రతి నిందితుడికీ అవకాశం ఉంటుందని, ఆ సమయంలో అతను ఆ విషయం చెప్పలేదని కురియన్ అన్నారు. ఇప్పుడు అతను ఆ విధమైన ఆరోపణలు ఎందుకు చేస్తున్నాడో మీరు తెలుసుకోండని ఆయన మీడియాతో అన్నారు.












Click it and Unblock the Notifications