అఫ్జల్ ఉరి: వివాదానికి ఆజ్యం పోసిన అసదుద్దీన్

అఫ్జల్ గురును కేంద్రం హఠాత్తుగా ఉరితీయడం వల్ల తమను వేరు చేస్తున్నారనే భావన కాశ్మీర్ యువతలో పెరుగుతుందని ఆయన అన్నారు. కాశ్మీర్‌ను వేరు చేసి చూస్తున్నారని భావన గురించి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మాట్లాడడం మంచిదేనని, అయితే, అఫ్జల్ గురు ఉరితీత తర్వాత అలా మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందని ఆయన అన్నారు.
ఉరితీతకు ముందు అఫ్జల్ గురును చూడాడనికి ఆయన కుటుంబ సభ్యులను అనుమతించకపోవడం బాధాకరమని అసదుద్దీన్ అన్నారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తీహార్ జైలులోని అఫ్జల్ గురు సమాధిని దర్శించడానికి భార్యను అనుమతించాల్సి ఉండిందని ఆయన అన్నారు.
కాశ్మీర్‌ను 2010లో సందర్శించి అఖిల పక్ష ప్రతినిధుల బృందంలో అసదుద్దీన్ ఓవైసీ ఉన్నారు. పార్లమెంటుపై దాడి కేసులో దోషి అఫ్జల్ గురును ఈ నెల 9వ తేదీన తీహార్ జైలులో ఉరి తీసిన విషయం తెలిసిందే. అఫ్జల్ గురు ఉరి గురించి కుటుంబ సభ్యులకు స్పీడ్ పోస్టు ద్వారా పంపించడాన్ని ఒమర్ అబ్దుల్లా తప్పు పట్టారు.












Click it and Unblock the Notifications