ఆషామాషీ కాదు, సాధారణ వ్యక్తి కాదు: జగన్‌పై సిబిఐ

YS Jagan - CBI Logo
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు ఆషామాషీ కేసేమీ కాదని, ఆయన కూడా సాధారణ వ్యక్తి కాదని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) కోర్టుకు తెలియజేసింది. జగన్‌ను ఇంకా ఎన్నాళ్లు జైళ్లో ఉంచుతారని, సిబిఐ సరైన ఆధారాలు ఇప్పటి వరకు చూపించలేదని, ఎప్పుడు దర్యాఫ్తు పూర్తి చేస్తారో అని అంతకుముందు జగన్ తరఫు న్యాయవాది సిబిఐని ప్రశ్నించారు.

దీంతో జగన్ రిమాండును పొడిగించేందుకు స్పష్టమైన కారణాలు తెలియజేయాలని సిబిఐ కోర్టు సిబిఐని ఆదేశించింది. కేసు దర్యాఫ్తు పురోగతిని ప్రతి పదిహేను రోజులకు ఒకసారి కోర్టుకు తెలుపాలని ఆదేశించింది. రిమాండు పొడిగింపుకు సరైన కారణాలు చూపాలని కోర్టు సిబిఐకి ఆదేశించింది. దర్యాఫ్తు తీరుపై మెమో దాఖలు చేయాలని సూచించింది. దీంతో సిబిఐ తరఫు న్యాయవాది ఈ కేసు సంక్లిష్టమైనదని, జగన్ సాధారణ వ్యక్తి కాదని కోర్టుకు చెప్పారు.

జగన్ రిమాండు పొడిగింపుకు స్పష్టమైన కారణాలు ఉన్నాయని చెప్పారు. జగన్‌కు బెయిల్ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేస్తారన్నారు. జైల్లో ఉంటే తాము స్వేచ్ఛగా దర్యాఫ్తు చేయగల్గుతామన్నారు. జగన్ ఆర్థికంగా, రాజకీయంగా పలుకుబడి కలిగిన వ్యక్తి అని అందుకే, బయటకు వస్తే ప్రభావితం చేయగల్గుతారన్నారు. సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. సాక్ష్యులు ఆయనకు భయపడి వెనక్కి తగ్గవచ్చునని చెప్పారు.

కేసు ప్రస్తుతం కీలక దశలో ఉందని, ఇలాంటి సమయంలో బెయిల్ ఇస్తే కేసు పురోగతిపై ప్రభావం పడుతుందన్నారు. జగన్ జైలులో ఉంటేనే దర్యాఫ్తు సక్రమంగా జరుగుతుందన్నారు. కేసు దర్యాఫ్తు చురుగ్గా సాగుతోందన్నారు. బెయిల్ పైన సుప్రీం కోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయని చెప్పారు. దర్యాఫ్తు ఎప్పటిలోగా పూర్తవుతుందో ఖచ్చితంగా చెప్పలేమన్నారు. అయితే, విచారణ మాత్రం త్వరితగతిన సాగుతోందన్నారు.

కోర్టు ముందు వివరాలు ఉంచుతామని చెప్పారు. ఈ కేసు ఆషామాషీది కాదని, సంక్లిష్టమైనదన్నారు. అందుకే నిర్ధిష్ట గడువును చెప్పలేమన్నారు. వివిధ కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నట్లు చెప్పారు. ఏడు వేర్వేరు అంశాలపై దర్యాఫ్తు పూర్తయ్యాక ఒకేసారి ఛార్జీషీటు దాఖలు చేస్తామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+