జగన్‌తో భేటీ: వ్యతిరేక కార్యకలాపాలని మరొకరిపై వేటు

గతంలో జగన్‌ను కలిసిన పలువురు నేతలను తెలుగుదేశం వెంబటే వేటు వేసిన సందర్భాలు ఉన్నాయి. పార్టీ సీనియర్ నేత మైసూరా రెడ్డి మొదలు ఇప్పుడు భాస్కర రామారావు వరకు జైల్లో జగన్‌ను కలిసిన పలువురు ప్రజాప్రతినిధులు, నేతలపై ఆలస్యం చేయకుండా పార్టీ వేటు వేసింది.
కాగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వైఖరి నచ్చకపోవడం వల్లనే తాను ఆ పార్టీని వీడినట్లు ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు గురువారం చెప్పిన విషయం తెలిసిందే. తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఎప్పుడు చేరే విషయం త్వరలో తెలియజేస్తానని అన్నారు. తాను పార్టీని వీడినప్పటికీ కార్యకర్తలు కూడా తన వెంటే ఉన్నారన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు రాష్ట్రంలోని ప్రతి పేద ఇంటికి చేరాయన్నారు.
రాష్ట్ర రాజకీయాల్లో వైయస్ జగన్ కీలక పాత్ర పోషిస్తారని ఆయన జోస్యం చెప్పారు. వైయస్ పథకాలు కొనసాగించడం ఒక్క జగన్‌కే సాధ్యమన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై వైయస్ కుటుంబాన్ని వేధిస్తున్నాయని ఆరోపించారు. వైయస్ జగన్‌కు అండగా ఉండాలని తాను నిర్ణయించుకున్నట్లు చెప్పారు. జైల్లో ఉన్న జగన్‌ను కలిసిన తాను ఆయనతో తన అభిప్రాయాలు పంచుకున్నానని చెప్పారు. తెలుగుదేశం పార్టీలో అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ లేదని ఆయన ఆరోపించారు. సమైక్యవాదంపై టిడిపి వైఖరి తనకు నచ్చలేదన్నారు.












Click it and Unblock the Notifications