ఇది బాబు పాలన రెండోభాగం: కిరణ్‌పై షర్మిల, జగనొస్తే..

Sharmila
నల్గొండ: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు డ్రామాలు ఆడుతున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల బుధవారం అన్నారు. షర్మిల పాదయాత్ర నల్గొండ జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆమె పలు ప్రాంతాల్లో మాట్లాడారు. జగన్ అధికారంలోకి వస్తే రైతులకు, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణ సదుపాయాన్ని కల్పిస్తారని షర్మిల హామీ ఇచ్చారు.

జగన్‌ను ముఖ్యమంత్రి చేస్తే వడ్డీలేని రుణాలతోపాటు వృద్ధ్దులకు రూ.700, వికలాంగులకు రూ. 1000 పింఛన్ అందజేస్తారన్నారు. విద్యుత్ ఛార్జ్జీలను పెంచి, రాష్ట్ర ప్రజలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ రూ.34వేల కోట్ల భారాన్ని వేసిందన్నారు. ప్రజల కష్టాలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలు పట్టని ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు బాబు ఇష్టం చూపడం లేదన్నారు.

బాబు అవిశ్వాసం పెట్టకుండా డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పథకాలకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తూట్లు పొడిచిందన్నారు. కాంగ్రెసు ప్రభుత్వ హయాంలో విద్యుత్ సరఫరా చక్కగ లేదన్నారు. విద్యుత్ సరిగా లేకున్నా బిల్లు బాగా వస్తుందని, అది కట్టకుంటే పోలీసు స్టేషన్‌కు ఈడ్చుకెళ్లి మెడ మీద లాఠీ పెట్టి మరీ వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

అధికార కాంగ్రెసు పార్టీతో తెలుగుదేశం పార్టీ కుమ్మక్కైందన్నారు. రైతుల బాధలు విన్నాక రాష్ట్రంలో మళ్లీ చంద్రబాబు పాలన కనిపిస్తోందన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి పరిపాలన చూస్తుంటే బాబు పరిపాలన రెండో భాగంగా అనిపిస్తోందన్నారు. బాబు తన పాలనలో ప్రజలను హింసించారని, ఇప్పుడు కిరణ్ హయాంలోను అదే జరుగుతోందన్నారు. బాబుకు పదవీ వ్యామోహం ఎక్కువ అన్నారు. కుర్చీ కోసం పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచాడన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+