బాబుకు ఝలక్: జగన్ వైపు ఎమ్మెల్సీ, 'రూ.5కోట్ల డీల్'

అయితే, బొడ్డు భాస్కర రామారావు జగన్ వైపు వెళ్లడం వెనుక డీల్ ఉందని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. జగన్ వైపుకు వెళ్లడం ద్వారా ఆయన తన సొంత జిల్లాలో ఒంటరి అయిపోయారని అంటున్నారు. బొడ్డు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లేందుకు నిర్ణయించుకోవడం వెనుక రూ.5 కోట్ల డీల్ కుదిరిందనే అనుమాలను తెలుగు తమ్ముళ్లు వ్యక్తం చేస్తున్నట్లు స్క్రోలింగ్స్ వచ్చాయి. ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రూ.8 కోట్లు ఖర్చు పెట్టారని, ఆ డబ్బు కోసమే ఫిరాయించారని అనుమానిస్తున్నారు.
కాగా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు పార్టీకి రాజీనామా చేస్తానని ఇరవై రోజుల క్రితం చెప్పారు. తాను సమైక్యవాదం కోసం నిలిచే పార్టీలో చేరి, సమైక్యవాదం కోసం పోరాటం చేస్తానని ఆయన చెప్పారు. దీన్నిబట్టి ఆయన వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరే అవకాశాలున్నట్లు అప్పుడే వార్తలు వచ్చాయి.
చంద్రబాబుపై, సీనియర్ నేత యనమల రామ కృష్ణుడిపై బొడ్డు అప్పుడు తీవ్రంగా మండిపడ్డారు. సమైక్యవాదానికి అండగా నిలిచే పార్టీలో చేరుతానని చెప్పారు. చంద్రబాబు కేంద్రానికి రాసిన లేఖ వల్లనే తెలంగాణకు అనుకూలంగా పరిస్థితులు మారాయని బొడ్డు భాస్కర రామారావు విమర్శించారు. అవసరమైతే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని ఆయన చెప్పారు. అఖిల పక్ష సమావేశంలో సమైక్యవాదాన్ని వినిపించడంలో తెలుగుదేశం పార్టీ విఫలమైందని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications