బాబు ఆదేశం: వాయిస్ పోతోందని తమ్ముళ్ల ఆందోళన!

తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆ వాదనను బలంగా వినిపించేందుకు, పార్టీ అభిప్రాయాలన్ని ప్రజల్లోకి జోరుగా తీసుకు వెళ్లేందుకు ప్రస్తుతం పార్టీ అధినేత అడ్డు చెబుతున్నారట. అందుకు సీమాంధ్ర ప్రజాప్రతినిధుల హెచ్చరికలు, సీమాంధ్రలో జరుగుతున్న వస్తున్నా మీకోసం పర్యటననే కారణం కావొచ్చునని అంటున్నారు. టిటిడిపి నేతలు బిజెపి, తెరాస పార్టీల వలే బలమైన తెలంగాణవాదంతో ముందుకుపోతే సీమాంధ్రలో పార్టీకి నష్టం జరుగుతుందని తెలుగు తమ్ముళ్లకు హెచ్చరించారట.
దీంతో టిడిపి తెలంగాణకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఆ వైఖరిని ప్రజల్లోకి తీసుకు వెళ్లలేని స్థితిలో ఉన్నారని అంటున్నారు. తెరాస, బిజెపిలు తెలంగాణ ఉద్యమంతో ప్రజల్లోకి వెళ్తున్నాయని, తాము కూడా ఓ కార్యక్రమాన్ని రూపొందించుకోవాలని టిటిడిపి నేతలు చాలా రోజులుగా భావిస్తున్నప్పటికీ చంద్రబాబు మాత్రం ప్రస్తుతానికి మౌనంగా ఉండమని సూచించటంతో వారు వెనక్కి తగ్గుతున్నట్లుగా చెబుతున్నారు.
తెలంగాణవాదం బలంగా వినిపించలేని పక్షంలో ప్రజా సమస్యలపై ఎంతగా పెదవి విప్పినా లాభం ఉండదని పైగా ఇతర పార్టీల వారు ప్రశ్నించే అవకాశం ఉంటుందనే ఉద్దేశ్యంతో తెలంగాణ టిడిపి నేతలు ప్రజా సమస్యల పైన కూడా అంతంత మాత్రనే స్పందిస్తున్నారని అంటున్నారు. అయితే, బాబు ఆదేశాల వల్ల తెలంగాణలో తమ వాయిస్ లేకుండా పోతోందనే ఆందోళనలో వారు ఉన్నట్లుగా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications