అఫ్జల్‌కే పదేళ్లు పట్టింది: నెల్లూరులో హత్యలకు నిరసన

మరోవైపు బంద్ నేపథ్యంలో పోలీసులు భారీ బందోస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. నగర వ్యాప్తంగా విద్యాసంస్థలు ఆందోళనకు దిగాయి. పలు మహిళా సంఘాలు ఆందోళలో పాల్గొన్నాయి. ఉగ్రవాదులు అయిన అఫ్జల్ గురు, అజ్మల్ కసబ్‌లలో ఒకరికి పదేళ్ల తర్వాత మరొకరికి నాలుగేళ్ల తర్వాత ఉరిశిక్ష పడిందని అలాంటిది భార్గవి, శకుంతలను చంపిన నిందితులకు ఎప్పుడు శిక్ష పడుతుందో చెప్పలేమన్నారు.
కాబట్టి వారిని బహిరంగంగా పోలీసులు కాల్చి పారేయాలని వారు డిమాండ్ చేశారు. జంట హత్యల కేసులో సత్వర న్యాయం జరుగుతుందనే నమ్మకం తమకు లేదన్నారు. అందుకే వారిని వెంటనే కాల్చి వేయాలని విద్యార్థులు, మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. కాగా మూడు రోజుల క్రితం ఫార్మసీ కళాశాల యజమాని దినకర్ రెడ్డి ఇంట్లో దుండగులు కత్తితో దాడి చేసిన ఘటనలో ఆయన భార్య, కూతురు మృతి చెందిన విషయం తెలిసిందే.
హైదరాబాదులో వివాహిత ఆత్మహత్య
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని రామంతపూర్‌లో మంజుల వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వరకట్న వేధింపులే కారణమని మంజుల బంధువులు ఆమె భర్త, అత్తమామలపై దాడికి దిగారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. ఈ ఘటనలో పోలీసు వాహనం స్వల్పంగా ధ్వంసమైంది.












Click it and Unblock the Notifications