గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దున్నపోతుకి గడ్డేస్తే పాలొస్తాయా?రంగెలేస్తుంది: బాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
గుంటూరు: దున్నపోతుకు గడ్డి వేసి పాలకోసం ఎదురు చూస్తే లాభం లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బుధవారం అన్నారు. చంద్రబాబు పాదయాత్ర గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దున్నపోతుకు గడ్డివేస్తే తిని పడుకుంటుందని, పాలివ్వకపోగా రంకెలేస్తుందన్నారు. అదే ఆవుకు గడ్డి వేస్తే సాధు జంతువులా పాలు ఇస్తుందని పేర్కొన్నారు.

దున్నపోతులాంటి కాంగ్రెస్ పార్టీ కావాలో.. సాధు జంతువులాంటి ఆవును కోరుకుంటారో తేల్చుకోవాలన్నారు. పోలవరం కట్టకుండా రూ.10 వేల కోట్లు వృధాగా ఖర్చు పెట్టారని, పులిచింతల ప్రాజెక్టు తొమ్మిదేళ్లయినా పూర్తి కాలేదని, మేమైతే రెండేళ్లలోనే పూర్తి చేసేవాళ్లమన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి నీటి యాజమాన్యం అంటే ఏమిటో కూడా తెలియదన్నారు. ఆయనకు దూరదృష్టి లేదన్నారు.

అక్రమార్కులను అరికట్టాలన్నారు. తిన్నవారిని వదిలేసేందుకు తమదేం పోయిందనుకోవద్దన్నారు. ఎవరి డబ్బో తింటున్నారనుకుంటే పొరపాటని, అదంతా ప్రజల సొమ్మే అన్నారు. ప్రజల ఎంగిలి మెతుకులే వారు తింటున్నారని మండిపడ్డారు. తమ వల్లనే తొలి నుంచి రైతు రుణాల మాఫీ అంశం చర్చకు వస్తోందన్నారు. దేశంలో ఇప్పటి వరకు రెండు సార్లు రుణమాఫీ అమలు జరిగిందని, అది టిడిపి వత్తిడితో నాడు దేవీలాల్ అమలు చేయగా.. 2009కు ముందు తమ పార్టీ రుణమాఫీపై హామీ ఇవ్వగా, వైయస్ అడ్డుపడ్డారని కానీ, కేంద్రం అమలు చేసిందన్నారు.

సమైక్యాంధ్ర అనండి సార్..

కాగా ఉప్పలపాడులో బాబు మాట్లాడుతుండగా ఓ రైతు ముందుకొచ్చి.. రాష్ట్రం కలిసిమెలిసి ఉండాలన్న ఆకాంక్షను వెలిబుచ్చారు. అంతటితో ఆగకుండా సార్.. సమైక్యాంధ్రపై ప్రకటన చేయండంటూ బాబును అడిగారు. పార్టీ వైఖరిని ఇప్పటికే తెలియజేశామని చంద్రబాబు గుర్తుచేశారు. పార్టీ వైఖరిని పలుమార్లు స్పష్టం చేశామని, దానిపై నిర్ణయం కేంద్రం చేయాల్సి ఉందన్నారు.

English summary
Telugudesam party chief Nara Chandrababu Naidu said on Wednesday that TDP is like cow and Congress is like buffalo.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X