కోర్టుకు కెసిఆర్, కోదండలు నో: 27న రావాలని సమన్లు

విద్వేష వ్యాఖ్యలకు సంబంధించి ఈ రోజు కెసిఆర్, కోదండరామ్‌లు కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. వారు హాజరు కాలేదు. దీంతో, కోర్టు వారికి మరోసారి సమన్లు పంపించింది. కెసిఆర్, కోదండరాంలకు సమన్లు రిజిస్టర్ పోస్టులో పంపించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. కాగా దీనికి సంబంధించి కేసు వేసిన న్యాయవాది మహ్మద్ మాట్లాడుతూ.. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఇందిరాగాంధీని అవమానించారని, ఉద్రేకపూరిత ప్రసంగాలతో తెలంగాణలు ఆత్మహత్యలకు కారణమవుతున్నారని తాను కేసు వేశానని చెప్పారు.
కాగా, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయంలో కెసిఆర్, కోదండరామ్‌లకు విశాఖ కోర్టు గత నెల జనవరి 31న మొదటిసారి సమన్లు జారీ చేసింది. కెసిఆర్, కోదండలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ సమైక్యాంధ్ర ఐక్యకార్యాచరణ సమితి విశాఖ న్యాయ సదన్‌కు చెందిన న్యాయవాదులు కోర్టులో అంతకుముందు పిటిషన్ దాఖలు చేసింది. దీనిని విచారణకు స్వీకరించిన కోర్టు ఈ రోజు కెసిఆర్, కోదండరామ్‌లకు సమన్లు జారీ చేసింది.
ఫిబ్రవరి 15న విశాఖ కోర్టు హాజరు కావాలని కోర్టు వారికి ఆదేశాలు జారీ చేసింది. కానీ, ఈ రోజు కోర్టుకు హాజరు కాకపోవడంతో విశాఖ కోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. వాటిని రిజిస్టర్ పోస్టు ద్వారా పంపాలని పోలీసులను ఆదేశిస్తూ.. ఈ నెల 27న కోర్టుకు హాజరు కావాలని కెసిఆర్, కోదండరాంలను ఆదేశించింది.












Click it and Unblock the Notifications