షర్మిలకు తెలంగాణ సెగ: చంద్రబాబూ! డ్రామాలు ఆపి

Sharmila
నల్గొండ: మరో ప్రజా ప్రస్థానం పేరిట నల్గొండ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలకు శుక్రవారం తెలంగాణ సెగ తగిలింది. ఆమె పాదయాత్ర జిల్లాలోని నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని ముకుందాపుర్‌లో ఉన్న సమయంలో తెలంగాణవాదులు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. షర్మిల ప్రసంగిస్తుండగా పలువురు తెలంగాణవాదులు జై తెలంగాణ అంటూ నినాదాలు చేసి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. తెలంగాణపై జగన్ పార్టీ స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాసేపటికి పరిస్థితి సద్దుమణిగింది.

షర్మిల పాదయాత్ర నియోజకవర్గంలోని అనుముల, నిడమనూరు మండలాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ఆమె పలు ప్రాంతాల్లో మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు పన్నులు ఎడాపెడా పెంచి ప్రజల రక్తం పిండుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజల సమస్యలు తీర్చాలంటే దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పాలన రావాలని, తన సోదరుడు జగన్‌తోనే అది సాధ్యమని ఆమె అన్నారు.

వైయస్ చనిపోయాక ప్రజా సమస్యలను పట్టించుకునే వారే లేరన్నారు. రోజుకు రెండు గంటలు కూడా కరెంటు రాక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ప్రజల గోడు వినిపిస్తున్నట్లుగా లేదన్నారు. అదే అయితే, ఆయన కిరణ్ ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం పెట్టేవారని షర్మిల విమర్శించారు. పాదయాత్రతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారన్నారు.

చంద్రబాబు ఇప్పటికైనా కిరణ్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని హితవు పలికారు. చంద్రబాబు వస్తున్నా మీకోసం పేరుతో చేస్తున్న పాదయాత్ర డ్రామాలు ఆపాలన్నారు. అవసరమైతే అవిశ్వాసం పెడతామని బాబు చెప్పారని, ఆయనకు అవసరమైతేనా? లేక ప్రజలకు అవసరమైతేనా? చెప్పాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+