పార్లమెంటును మించింది!: ప్రపంచంలో ఎత్తైన జాతిపిత

ఇప్పటి వరకు ఢిల్లీలోని పార్లమెంటు ఆవరణలో ఉన్న మహాత్ముడి విగ్రహమే పెద్దదిగా భావిస్తున్నారు. పార్లమెంటు ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం ఎత్తు 16 అడుగులు. పాట్నాలోని గాంధీ విగ్రహం ఎత్తు 40 అడుగులు. ఇందుకోసం ఉపయోగించిన పీఠం ఎత్తు ముప్పై అడుగులు. మొత్తం డెబ్బై అడుగుల ఎత్తు విగ్రహం ఇది.
దీనిని పది కోట్ల రూపాయల వ్యయంతో బీహార్ ప్రభుత్వం దీనిని ఏర్పాటు చేసింది. ఢిల్లీకి చెందిన శిల్పి రామ్ సుతార్ ఈ విగ్రహాన్ని రూపొందించారు. మహాత్ముడు నిలబడి ఉన్నట్లు ఉండే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తమకు ఎంతో గర్వకారణమని బీహార్ ప్రభుత్వం ప్రకటించింది.
ఈ విగ్రహ ఏర్పాటుతో.. ఢిల్లీలోని పార్లమెంట్ వద్ద ధ్యానం చేస్తున్నట్టుండే గాంధీ విగ్రహం రెండో స్థానానికి పరిమితమైంది. పార్లమెంటులో గాంధీ విగ్రహం ధ్యానముద్రలో ఉంటారు. పాట్నాలో నెలకొల్పిన విగ్రహంలో గాంధీజీ చిరునవ్వుతో కనిపిస్తారు. ఇద్దరు చిన్నారులు ఆయనకు రెండు వైపులా ఉంటారు. ముప్పై అడుగుల ఎత్తున్న పీఠంపై ఈ కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.












Click it and Unblock the Notifications