రోశయ్యే అడ్డుకున్నారు: తెలంగాణపై సర్వే సంచలనం

తెలంగాణను కేంద్రం ప్రకటించి, నాడు ముఖ్యమంత్రిగా రోశయ్యని ఢిల్లీకి పిలిచారని, రాష్ట్రానికి వెళ్లి అసెంబ్లీలో తెలంగాణపై తీర్మానం చేయించమని ఆయనను కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశించిందని, అందుకు ఆయన ఇష్టపడలేదన్నారు. ఢిల్లీలో సరేనని ఇక్కడకు వచ్చి సీమాంధ్ర ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించారని ఆరోపించారు. తెలంగాణ ఇస్తామని చెప్పి 2009 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చామని, తెలంగాణ ఇచ్చాకే 2014 సాధారణ ఎన్నికలకు వెళుతామని స్పష్టం చేశారు.
మోసం చేసిన కాంగ్రెసు
విద్యార్థులు గ్రామాల్లోకి వెళ్లి తెలంగాణపై కాంగ్రెసు చేసిన మోసంపై వివరించాలని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ అన్నారు. శనివారం ఖమ్మంలో జరిగిన ఖమ్మం విద్యార్థి గర్జనలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణకు కాంగ్రెస్ వారే ప్రథమ శత్రువులన్నారు. కాంగ్రెస్ పార్టీని నిలదీయాలన్నారు.
24న సడక్‌బంద్‌కు పిలుపునిచ్చామని అందులో అందరూ పాల్గొనాలన్నారు. తెలంగాణపై కేంద్రం నాలుగు సార్లు మాట ఇచ్చి తప్పిందన్నారు. అఖిలపక్షంలో సిపిఎం తప్ప మిగతా అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూల ప్రకటనలు చేసినా కేంద్రానికి చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు.












Click it and Unblock the Notifications