ఉండవల్లిపై వరంగల్‌లో కేసు, రెచ్చగొట్టారని ఆరోపణ

రవీందర్ ఫిర్యాదును పరిశీలించిన మెజిస్ట్రేట్ ఉండవల్లిపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. జనవరి 25వ తేదీన రాజమండ్రిలో నిర్వహించిన సభలో ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని రవీందర్ తన ఫిర్యాదులో ఆరోపించారు.
ఉండవల్లిపై కేసు నమోదు చేసి, సంఘటనపై దర్యాప్తు చేసిన వచ్చే నెల 25వ తేదీ లోపు నివేదిక సమర్పించాలని మెజిస్ట్రేట్ కాకతీయ విశ్వవిద్యాలయం పోలీసులను ఆదేశించారు. జనవరి 25వ తేదీన రాజమండ్రిలో జై ఆంధ్రప్రదేశ్ పేరిట ఉండవల్లి అరుణ్ కుమార్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ఆ సభలో కాంగ్రెసుకు చెందిన పలువురు సీమాంధ్ర నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌ను వ్యతిరేకిస్తూ సాగిన ఈ సభలో ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications