మజ్లీస్ ఎమ్మెల్యే పాషా ఖాద్రీపై మరో కేసు నమోదు

Pasha Quadri
కరీంనగర్: హైదరాబాదులోని చార్మినార్ శానససభ్యుడు, మజ్లీస్ నాయకుడు సయ్యద్ పాషా ఖాద్రీపై కరీంనగర్ జిల్లా జగిత్యాల పోలీసులు సోమవారం రాత్రి కేసు నమోదు చేశారు. జగిత్యాల ఉర్దూ మీడియం పాఠశాలలో గత నెల 17న పదవతరగతి విద్యార్థులకు స్టడీమెటీరియల్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీపై చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి.

జాతిపిత మహాత్మాగాంధీతోపాటు భారతీయుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎమ్మెల్యే మాట్లాడారని జగిత్యాలకు చెందిన హైకోర్టు న్యాయవాది ఎన్నంపల్లి గంగాధర్ జగిత్యాల క్రిమినల్ కోర్టులో ఈనెల 6న పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌పై స్పందించిన జడ్జి కల్పన ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలంటూ పోలీసులను ఆదేశించారు. దీంతో పాషా ఖాద్రీపై జగిత్యాల టౌన్ పోలీసులు 121ఏ, 124ఏ, 153ఏ, 323, 334, 499, 500, 504 ఐపీసీ సెక్షన్ల కింద సోమవారం రాత్రి కేసు నమోదు చేశారు.

శానససభ ఆవరణలో మహాత్మా గాంధీ విగ్రహ ప్రతిష్టాపనపై పాషా ఖాద్రీ జనవరి 17వ తేదీన చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. ఇప్పటికే హైదరాబాదులోని ఛత్రినాక పోలీసు స్టేషన్‌లో కూడా పాషా ఖాద్రీపై కేసు నమోదైంది.

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు పి. లక్ష్మణ్ పాషా ఖాద్రీ వ్యాఖ్యలపై కోర్టుకు ఎక్కారు. పాషా ఖాద్రీపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. దీంతో స్థానిక కోర్టు ఆదేశాల మేరకు ఛత్రినాక పోలీసులు పాషా ఖాద్రీపై కేసు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+