నేనే పోటీ చేస్తా: పురంధేశ్వరికి టిఎస్సార్ ఝలక్

Purandeshwari - T Subbirami Reddy
విశాఖపట్నం: కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరికి కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు టి. సుబ్బిరామిరెడ్డి మరోసారి ఝలక్ ఇచ్చారు. విశాఖపట్నం లోకసభ స్థానం నుంచి కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా తానే పోటీ చేస్తానని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఈ సీటు నుంచి ప్రస్తుతం పురంధేశ్వరి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

పురంధేశ్వరిని నర్సారావుపేట నుంచి పోటీకి దింపాలనే ఆలోచనలో కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఉందని టిఎస్సార్ అన్నారు. స్థానిక పరిస్థితులు, ప్రజలతో ఉన్న సంబంధాల ఆధారంగానే లోకసభకు పోటీ అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని ఆయన అన్నారు.

విశాఖపట్నం లోకసభ స్థానం నుంచి గతంలో టి. సుబ్బిరామిరెడ్డి గతంలో పోటి చేసి గెలిచారు. 2009 ఎన్నికల్లో ఆ సీటును కాంగ్రెసు అధిష్టానం దగ్గుబాటి పురంధేశ్వరికి కేటాయించింది. అక్కడి నుంచి పోటీ చేసి ఆమె విజయం సాధించారు. ఆమె విశాఖపట్నం నుంచి మారడానికి అయిష్టత వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకు ముందు విశాఖపట్నం సీటు నుంచి పోటీ చేసే విషయంపై పురంధేశ్వరికి, టి. సుబ్బిరామిరెడ్డికి మధ్య మాటల యుద్ధం జరిగింది. ప్రకాశం జిల్లాకు చెందిన పురంధేశ్వరి, నెల్లూరు జిల్లాకు చెందిన టి. సుబ్బిరామిరెడ్డి విశాఖపట్నం సీటు కోసం పోటీ పడడం ఒక రకంగా ఆశ్చర్యకరమైన విషయమే. సుబ్బిరామిరెడ్డి చాలా కాలంగా విశాఖపట్నంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+