మా అల్లుడు వెరీగుడ్డు!: అనిల్‌కు విజయమ్మ క్లీన్ చిట్

YS Vijayamma
హైదరాబాద్: తన అల్లుడు, ప్రముఖ క్రైస్తవ మత ప్రచారకుడు బ్రదర్ అనిల్ కుమార్‌కు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ క్లీన్ చిట్ ఇచ్చారు. బ్రదర్ అనిల్‌కు, రక్షణ స్టీల్స్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆమె బుధవారం చెప్పారు. అనిల్ పైన వస్తున్న ఆరోపణలు అన్నీ రాజకీయపరమైనవే అని ఆమె చెప్పారు. తన తనయుడు, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో జైలు నుండి బయటకు వస్తాడని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

పార్టీ పటిష్టత కోసం తాను త్వరలో జిల్లాల్లో పర్యటిస్తానని విజయమ్మ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైందని విజయమ్మ అన్నారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం నిత్యావసర ధరలను పెంచి సామాన్యుల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. అవిశ్వాసం పెట్టి ప్రభుత్వాన్ని కూల్చాల్సిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కిరణ్ ప్రభుత్వాన్ని కాపాడటం సిగ్గుచేటు అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడాలని కార్యకర్తలకు ఆమె పిలుపునిచ్చారు.

కాగా బుధవారం హైదరాబాదు లోటస్ పాండులోని పార్టీ కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. వైయస్ విజయమ్మ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. పార్టీ అధ్యక్షుడిని ప్రజల నుంచి దూరం చేసినా ప్రజా సమస్యలపై పోరాటాలు, నిర్మాణంలో ఏమాత్రం వెనుకబడకూడదని జగన్ పార్టీ భావిస్తోంది. ఇందుకోసం భవిష్యత్తు కార్యాచరణ రూపొందించేందుకు సమావేశమైంది.

అనిల్‌పై విచారణ జరిపించాలి

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ పైన వచ్చిన కబ్జా ఆరోపణలపై విచారణ జరిపించాలని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు వేరుగా డిమాండ్ చేశారు. ఆయన ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను ఈరోజు ఉదయం కలిశారు.

అనిల్ పైన వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపేలా చర్యలు తీసుకోవాలనికోరారు. నామినేటెడ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే కార్యకర్తలు ఊరుకోరున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో పార్టీ సీనియర్ల సలహాలు తీసుకోవాలని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+