నాది 30 ఏళ్ల బంధం, పురంధేశ్వరిది ఐదేళ్లే: టిఎస్సార్

విశాఖపట్నం నుంచే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని పురంధేశ్వరి అన్నారని, అలా అన్నందుకే తాను ప్రతిస్పందించానని టిఎస్సార్ అన్నారు. సీట్ల కేటాయింపు కాంగ్రెసు పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే జరుగుతుందని ఆయన అన్నారు. విశాఖపట్నం ఎంపి ఎవరంటే సుబ్బిరామిరెడ్డి అని ప్రజలు అనుకుంటారని ఆయన అన్నారు
ఈ ఏడాది మార్చి నుంచి విశాఖపట్నం విమానాశ్రయం వారానికి మూడు రోజులు 24 గంటలు పనిచేస్తుందని ఆయన చెప్పారు. కెజెఎస్ అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని ఆయన అన్నారు.
విశాఖపట్నం లోకసభ స్థానం నుంచి కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా తానే పోటీ చేస్తానని సుబ్బిరామిరెడ్డి మంగళవారంనాడు కూడా మీడియా ప్రతినిధులతో అన్నారు. ఈ సీటు నుంచి ప్రస్తుతం పురంధేశ్వరి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. పురంధేశ్వరిని నర్సారావుపేట నుంచి పోటీకి దింపాలనే ఆలోచనలో కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఉందని టిఎస్సార్ అన్నారు.
స్థానిక పరిస్థితులు, ప్రజలతో ఉన్న సంబంధాల ఆధారంగానే లోకసభకు పోటీ అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని ఆయన అన్నారు. విశాఖపట్నం లోకసభ స్థానం నుంచి గతంలో టి. సుబ్బిరామిరెడ్డి గతంలో పోటి చేసి గెలిచారు. 2009 ఎన్నికల్లో ఆ సీటును కాంగ్రెసు అధిష్టానం దగ్గుబాటి పురంధేశ్వరికి కేటాయించింది. అక్కడి నుంచి పోటీ చేసి ఆమె విజయం సాధించారు. ఆమె విశాఖపట్నం నుంచి మారడానికి అయిష్టత వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications