మహిళా శవాన్ని షెల్ఫ్‌లో కుక్కి ప్లాస్టరింగ్ చేశారు.

Woman murdered in Visakhapatnam
విశాఖపట్నం: విశాఖపట్నంలోని రెడ్డి కంచరపాలెంలో ఇటీవల అదృశ్యమైన మహిళ ఓ పెయింటర్ ఇంట్లో శవమై తేలింది. ఆమె మృతదేహాన్ని వంటగదిలోని ఓ షెల్ఫ్‌లో కుక్కి ప్లాస్టరింగ్ చేసేశారు. అయితే గది నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు సోమవారం రాత్రి కంచరపాలెం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మంగళవారం పోలీసులు ప్లాస్టరింగ్‌ను తొలగించడంతో ఈ దారుణం బయటపడింది.

తిక్కవానిపాలేనికి చెందిన వాసుపల్లి అర్రమ్మ (45) చేపలు విక్రయిస్తుంటుంది. స్థానికంగా వడ్డీ వ్యాపారం కూడా చేసేది. ఈ నెల 12న చేపలు అమ్మేందుకు వెళ్లిన అర్రమ్మ తిరిగి ఇంటికి చేరకపోవడంతో ఆమె భర్త అప్పారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కప్పరాడకు చెందిన పెయింటర్ నీలాపు వేణు (25)కు ఏడాది క్రితం రమతో వివాహమైంది. ఈ జంట మాజీ కార్పొరేటర్ అప్పలరెడ్డి ఇంట్లో అద్దెకు దిగారు. అర్రమ్మ వద్ద వేణు కొంతమొత్తాన్ని అప్పుగా తీసుకున్నాడని, ఈ విషయమై వీరిద్దరి మధ్య తరచూ ఘర్షణలు జరిగేవని మృతురాలి కుటుంబసభ్యులు తెలిపారు.

ఆరు నెలల గర్భవతి రమ ప్రసూతి కోసం పుట్టింటికి వెళ్లింది. ఈ నేపథ్యంలో వేణుయే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉండవచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+