• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

సార్వత్రిక సమ్మె: స్తంభించిన రవాణా, కార్మికనేత మృతి

By Srinivas
|
Sena 'sabotages' union leader's plans, Mumbai to be normal
న్యూఢిల్లీ/హైదరాబాద్/ముంబయి: కార్మిక సంఘాలతో కేంద్ర ప్రభుత్వం మంగళవారం జరిపిన చర్చలు విఫలం కావడంతో దేశంలోని పదకొండు కార్మిక సంఘాలు సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్నాయి. తమ డిమాండ్ల సాధన కోసం ఈ కార్మిక సంఘాలు బుధవారం, గురువారం సమ్మెలో పాల్గొంటున్నాయి. దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో పలు సంఘాలు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. సమ్మెతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది.

మహారాష్ట్రలో శివసేన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేసేందుకు కీలకంగా పని చేస్తోంది. ముంబయిలో సమ్మె ప్రభావం అంతగా పడలేదు. ఆంధ్రప్రదేశ్‌లోని కరీంనగర్ జిల్లా రామగుండం 1,2,3 ఏరియాల్లో సింగరేణి కార్మికులు ఉదయం విధులను బహిష్కరించారు. అదిలాబాదు జిల్లాలోను కార్మికులు ఆందోళనకు దిగారు. జిల్లాలోని 19 గనుల్లో ఇరవై వేల మంది కార్మికులు విధులను బహిష్కరించడంతో ఉత్పత్తి నిలిచిపోనుంది. ఖమ్మం, వరంగల్ జిల్లాల పరిస్థితి ఇంతే.

హైదరాబాద్, విశాఖ, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో ఆటోలు ఎక్కడికి అక్కడ నిలిచిపోయాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని కొత్తూరు జూట్ మిల్లులో 7వేల మంది కార్మికులు విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. కాగా, ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రులు ఎకె ఆంటోనీ, శరద్‌పవార్, మల్లికార్జున ఖార్గేలు పాల్గొన్న మంగళవారం నాటి చర్చలు విఫలమయ్యాయి.

ధరల పెరుగుదల అరికట్టాలని, ఉపాధి కల్పన జరగాలని, కార్మిక చట్టాల అమలు కఠినతరం చేయాలనంటూ కేంద్ర కార్మిక సంఘాల ప్రతినిధులు పలు డిమాండ్లు చేశారు. ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటిదాకా తీసుకున్న చర్యలను మంత్రులు వారికి వివరించారు. తమ డిమాండ్లపై నిర్దిష్ట హామీ ఏదీ ప్రభుత్వం నుంచి లభించకపోవడంపై కార్మిక సంఘాల నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం నుంచి రెండు రోజుల పాటు సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చారు.

ట్రేడ్ యూనియన్ లీడర్ మృతి

రెండు రోజుల సార్వత్రిక సమ్మెలో భాగంగా బుధవారం ప్రారంభమైన సమ్మె మొదటి రోజు హర్యానాలో విషాదం అయింది. హర్యానా రాష్ట్రంలోని అంబాలా బస్సు డిపో వద్ద ఏఐటియుసి ధర్నా చేసింది. డిపో నుండి బయటకు వస్తున్న బస్సును ఆపేందుకు కార్మికులు ప్రయత్నించారు. ఈ ఘటనలో కార్మిక నేత నరేంద్ర సింగ్ మృతి చెందాడు.

దీంతో రెచ్చిపోయిన కార్మికులు విధ్వంసానికి దిగారు. సమ్మె నేపథ్యంలో బలవంతంగా బస్సుల్ని నడిపేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని వారు ఆరోపించారు. నరేంద్ర సింగ్ మృతికి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జిఎం కారణమని పేర్కొంటూ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Shiv Sena allegedly played a key role in sabotaging union leader Sharad Rao's plans of making the two-day strike a success here. Sources said it did so by winning support of many key members of the state-level federation of the unions and Rao, known for his militant trade unionism, was left isolated.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more