వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ఆస్తుల అటాచ్‌మెంట్ 18కి: పొన్నాలది 27కి

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan - Ponnala Laxmaiah
న్యూఢిల్లీ/హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్(ఈడి) నోటీసులపై న్యాయప్రాధికార సంస్థ మార్చి 18న విచారణ జరుపనుంది. జగన్ కేసుతో పాటు రాంకీ కేసులోనూ ఈడి నోటీసు పైన అదే రోజు విచారణ జరుపనుంది. రాంకీ, జగతి కేసులో రూ.143.7 కోట్ల ఆస్తుల అటాచ్‌మెంటు చేస్తూ జనవరి 7వ తేదిన ఈడి నోటీసులు జారీ చేసింది.

కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి, ఆయా సంస్థల ఆస్తుల అటాచ్‌మెంట్ పైన మార్చి 7న న్యాయప్రాధికార సంస్థ విచారణ చేపట్టనుంది. ఓఎంసి కేసులో రూ.740 కోట్ల ఆస్తుల అటాచ్‌మెంట్ జరిగిన విషయం తెలిసిందే. అంత మొత్తాన్ని అటాచ్ చేస్తు గతంలో ఈడి గాలి జనార్ధన్ రెడ్డి, సంస్థలకు నోటీసులు జారీ చేసింది.

పొన్నాల కేసు 27కు వాయిదా

ఐటి శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఎన్నిక కేసు విచారణను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఈ నెల 27వ తేదికి వాయిదా వేసింది. ఈ రోజు(గురువారం) పొన్నాల లక్ష్మయ్య కోర్టుకు హాజరయ్యారు. ఆయన 2009 నాటి ఎన్నికపై వివరణ ఇచ్చారు. అనంతరం కోర్టు కేసును వాయిదా వేసింది.

2009 సాధారణ ఎన్నికల్లో పొన్నాల లక్ష్మయ్య వరంగల్ జిల్లా జనగామ నియోజకవర్గం నుండి గెలుపొందారు. ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ ప్రత్యర్థి, నాటి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో పొన్నాల ఇప్పటికి మూడుసార్లు హైకోర్టుకు హాజరయ్యారు.

English summary
High Court of Andhra Pradesh has postponed minister Ponnala Laxmaiah's case to February 27th. Minister Ponnala Laxmaiah attended before High Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X