హెచ్చరికలు రొటిన్‌గానా?: పేలుళ్లపై బాబు, ఊహాచిత్రాలు

నిఘా వర్గాలు, కేంద్ర హోంశాఖ హెచ్చరికలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రొటీన్‌గా తీసుకోవడం బాధాకరమన్నారు. హెచ్చరికలను పట్టించుకోకుండా ఉండవద్దని సూచించారు. శాంతిభద్రతల విషయంలో మరింత ముందు జాగ్రత్త చర్యలు పాటించాల్సిన అవసరముందన్నారు. సాయిబాబా గుడి వద్ద పన్నెండేళ్ల క్రితం ఘటన జరిగిన తర్వాత 2002 నుండి 2004 వరకు టిడిపి లా అండ్ ఆర్డర్‌ను కట్టుదిట్టం చేసిందన్నారు.
రాజకీయాలకు అతీతంగా ఈ ఘటనపై స్పందించాలని ఆయన అన్నారు. పక్కా ప్రణాళిక ప్రకారమే పేలుళ్లు జరిగినట్లుగా తెలుస్తోందన్నారు. ప్రజలు సంయమనంతో ఉండాలని సూచించారు. హెచ్చరికలు బేఖాతరు చేయడం వల్ల అమాయకుల ప్రాణాలు పోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఉద్యోగానికి వెళ్లిన వారు సురక్షితంగా తిరిగి వస్తారనే నమ్మకం లేకుండా పోయిందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన సూచించారు. అనంతరం ఆయన కమలా ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు.
సడక్ బంద్ వాయిదా
దిల్‌సుఖ్ నగర్‌లో బాంబు పేలుడు నేపథ్యంలో ఈ నెల 24న జరగాల్సిన సడక్ బందును తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి వాయిదా వేసింది.
ఊహా చిత్రాలు విడదల
కాగా, అనుమానిత నిందితుల ఊహా చిత్రాలను కేంద్ర హోంశాఖ శుక్రవారం ఉదయం విడుదల చేసింది. ముజాహిద్దీన్‌కు చెందిన తహ్రీజ్, వసీక్‌ల చిత్రాలను కేంద్రం విడుదల చేసింది. వీరు పేలుళ్లకు పాల్పడినట్లుగా కేంద్రం హోంశాఖ అనుమానిస్తోంది.












Click it and Unblock the Notifications