16కు చేరిన మృతులు: 14 మంది మృతులు వీరే

కొత్తపేటలోని ఓమ్నీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 18 మంది క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఖమ్మం జిల్లా చింతూరుకు చెందిన దుర్గాప్రసాద్ (23), నల్లగొండ జిల్లాకు చెందిన రాజేందర్ రెడ్డి (21), హైదరాబాద్ బోరబండకు చెందిన మారుతి (23) పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు.
1. ఎ రాములు (వారాసిగుడా, హైదరాబాద్)
2. ఎజాజ్ అహ్మద్ (ప్రేమ్‌నగర్, అంబర్‌పేట, హైదరాబాద్, పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం విద్యార్థి)
3. మహ్మద్ రఫీ (బాబానగర్, హైదరాబాదులోని చాంద్రాయణగుట్టలో బ్యాగులు కుట్టే వ్యక్తి)
4. ముత్యాల రాజశేఖర్ (ఎంబిఎ), (ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం నంనూర్ గ్రామం)
5. వడ్డే విజయ్ కుమార్ (ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం నంనూర్ గ్రామం)
6. హరీష్ కార్తిక్ (దిల్‌షుక్‌నగర్, హైదరాబాద్, స్వగ్రామం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల)
7. పద్మాకర్ దివాన్‌జీ (కొత్తపేట జిలేబీ తయారీదారుడు)
8. వెంకటేశ్వర రావు (వెటర్నరీ అసిస్టెంట్ మలక్‌పేట్, స్వస్థలం నల్లగొండ జిల్లా దేవరకొండ)
9. స్వప్నారెడ్డ్ి (సంతోష్‌నగర్, ఎంబిఎ విద్యార్థి)
10. ఆనంద్‌కుమార్ (బిటెక్ ఇసిఇ చివరి సంవత్సరం, నోవా కళాశాల, రామోజీ ఫిలం సిటీ వద్ద, స్వస్థలం అనంతపురం జిల్లా, ప్రస్తుతం చైతన్యపురిలోని శ్రీ అంజనేయ హాస్టల్లో ఉండి చదువుతున్నాడు)
11. తిరుపతయ్య (గోదావరిఖని, కరీంనగర్ జిల్లా)
12. శ్రీనివాసరెడ్డి (రెంటచింతల, గుంటూరు జిల్లా)
13. చోగారం కులాజీ (రాజస్థాన్)
14. గిరి (రామన్నపేట, నల్లగొండ జిల్లా) ఓమ్నీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించాడు.












Click it and Unblock the Notifications