పేలుళ్లు: హైదరాబాదులో హోం మంత్రి షిండే (ఫొటోలు)

హైదరాబాద్: బాంబు పేలుళ్లు నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే శుక్రవారం ఉదయం హైదరాబాదు వచ్చారు. హైదరాబాదులోని దిల్‌షుక్‌నగర్‌లో పేలుళ్లు సంభవించిన ప్రదేశాలను ఆయన చూశారు. వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, గవర్నర్ నరసింహన్, రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మరికొంత మంది మంత్రులు ఆయన వెంట ఉన్నారు.

ఆ తర్వాత సుశీల్ కుమార్ షిండే కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. చికిత్సపై క్షతగాత్రులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉగ్రవాద దాడులకు సంబంధించి రెండు రోజుల క్రితం రాష్ట్రాలను హెచ్చరించామని, అయితే, ప్రత్యేకంగా ఫలానా చోట దాడులు అవకాశం ఉన్నట్లు నిర్దిష్టమైన సమాచారం ఇవ్వలేదని ఆయన మీడియా సమావేశంలో చెప్పారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీ వెళ్లి పార్లమెంటులో హైదరాబాదు పేలుళ్ల గురించి ప్రకటన చేశారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది. మృతులకు సంతాపం ప్రకటిస్తూ మంత్రివర్గం రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది. ఆ తర్వాత సమాచార, పౌర సంబంధాల మంత్రి డికె అరుణ మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజలు సంయమనం పాటించాలని ఆమె ప్రజలను కోరారు.

 పేలుళ్లు: హైదరాబాదులో హోం మంత్రి షిండే (ఫొటోలు)

హైదరాబాద్ విమానాశ్రయంలో కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేకు స్వాగతం చెప్పిన ముఖ్యమంత్రి కిరణ్ రెడ్డి, గవర్నర్ నరసింహన్, తదితరులు

 పేలుళ్లు: హైదరాబాదులో హోం మంత్రి షిండే (ఫొటోలు)

బాంబు పేలుళ్లు సంభవించిన చోట వివరాలు అడిగి తెలుసకుంటున్న షిండే...

 పేలుళ్లు: హైదరాబాదులో హోం మంత్రి షిండే (ఫొటోలు)

బాబు పేలుడు సంభవించిన చోట ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులతో కలిసి సుశీల్ కుమార్ షండే..

 పేలుళ్లు: హైదరాబాదులో హోం మంత్రి షిండే (ఫొటోలు)

సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకుంటున్న సుశీల్ కుమార్ షిండే

 పేలుళ్లు: హైదరాబాదులో హోం మంత్రి షిండే (ఫొటోలు)

కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు ఇస్తున్న చికిత్స గురించి మాట్లాడుతున్న షిండే

 పేలుళ్లు: హైదరాబాదులో హోం మంత్రి షిండే (ఫొటోలు)

కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ క్షతగాత్రుడి వద్ద ముఖ్యమంత్రి కిరణ్ రెడ్డితో కలిసి షిండే..

 పేలుళ్లు: హైదరాబాదులో హోం మంత్రి షిండే (ఫొటోలు)

కేర్ ఆస్పత్రిలో సుశీల్ కుమార్ షిండే, ముఖ్యమంత్రి కిరణ్ రెడ్డి వైద్యులతో కలిసి..

 పేలుళ్లు: హైదరాబాదులో హోం మంత్రి షిండే (ఫొటోలు)

సంఘటనా స్థలాన్ని సందర్శించి, క్షతగాత్రులను పరామర్శించిన తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడుతున్న షిండే..

 పేలుళ్లు: హైదరాబాదులో హోం మంత్రి షిండే (ఫొటోలు)

హైదరాబాదు పేలుళ్ల ఘటనలో మరణించినవారికి సంతాపం ప్రకటించిన రాష్ట్ర మంత్రి వర్గం..

 పేలుళ్లు: హైదరాబాదులో హోం మంత్రి షిండే (ఫొటోలు)

మంత్రివర్గ సమావేశానంతరం శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల మంత్రి డికె అరుణ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+