కసబ్‌లా ఉరే: షబ్బీర్, బొత్సకి చిన్నవిషయమా: రేవంత్

Shabbir Ali - Revanth Reddy
హైదరాబాద్: దిల్‌సుఖ్ నగర్ జంట పేలుళ్ల నిందితులకు అజ్మల్ కసబ్, అఫ్జల్ గురుల వలె సాధ్యమైనంత త్వరగా ఉరిశిక్ష విధించాలని మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ శుక్రవారం డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దిల్‌సుఖ్ నగర్ జంట పేలుళ్ల బాధితులను ఆయన ఉదయం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈ ఘటనలో తమ జిల్లాకు చెందిన రజిత అనే ఎంబియే విద్యార్థిని, మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి గాయపడ్డారని, రజితకు కాలు తీసేశారని, మధుకు మేజర్ ఆపరేషన్ జరిగిందని చెప్పారు. వారిద్దరికి ఎలాంటి ప్రాణాపాయం లేదన్నారు. ఉగ్రవాదుల చర్యను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. ఈ చర్యలకు పాల్పడిన వారిని వెంటనే గుర్తించి అరెస్టు చేయాలని, వారిని కసబ్, అఫ్జల్‌లా ఉరి తీయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కేంద్ర వైఫల్యం

ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బిజెపి జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ అన్నారు. సంఘటన ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బాధితులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నానని, వారి పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. కేంద్రం నుండి స్పష్టమైన సమాచారం లేనందువల్లనే పేలుళ్లు సంభవించాయన్నారు.

పేలుళ్లకు హైదరాబాదు కేంద్ర బింధువవుతోందన్నారు. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటన సరిగా లేదన్నారు. ఉగ్రవాదుల చర్యలను కేంద్రం సవాలుగా తీసుకోవడం లేదన్నారు. వరుస పేలుళ్లలో పాకిస్తాన్ ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. కేంద్రం సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు.

అర్థం లేని దుర్మార్గం

ఉగ్రవాదుల చర్య అర్థం లేని దుర్మార్గం అని కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి అన్నారు. ఉగ్రవాదాన్ని పట్టుదలతో నిర్మూలించాలన్నారు. ఉగ్రవాద శక్తులను కేంద్రం అణిచివేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఉగ్రవాదుల చర్యల వల్ల ఎవరికీ లాభం లేదన్నారు. ఈ ఘటనలో అధికార పార్టీని నిందించడం ప్రతిపక్షాలకు సులువే అన్నారు.

చిన్న ఘటననా?

పేలుళ్ల అంశాన్ని పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ చిన్న ఘటనగా కొట్టి పారేయడాన్ని టిడిపి నేత రేవంత్ రెడ్డి తప్పు పట్టారు. ప్రభుత్వం మంచి అధికారులను లూప్ లైన్‌లో పెడుతోందని ఆరోపించారు.

కాగా కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ హైదరాబాద్ వచ్చారు. ఆయన పేలుడు సంఘటన ప్రాంతాన్ని పరిశీలిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+